సాధారణంగా మనిషి అధిక బరువు పెరిగితే అది అనర్థాలకు చేటు అంటారు. సన్నగా ఉంటే మంచి ఫిట్ నెస్ తో ఉన్నారని అంటారు.  సాధారంగా మనిషి తాను తినే  ఆహార పదార్థాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.  ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారు.  ఇప్పుడు మనిషి డైట్ ఎంతో అవసరం ఇమ్యూనిటీ శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం అని తెలుసుకోవాలి. 


👉🏻 ఉదయం ముఖం కడగగా నే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. గంట తరువాత మళ్ళీ రెండు గ్లాసుల నీరు తాగాలి.

👉🏻 టిఫిన్ కి 30 నిమిషాల ముందు గ్లాస్ జ్యూస్ తాగాలి. వీటిలో తేనే, నిమ్మరసం కలపాలి.

👉🏻 టిఫిన్ గా తేలికైన ఆహారాలు తీసుకోవాలి. నూనెలో వేయించినవి తినవద్దు.

👉🏻 భోజనానికి 30 నిముషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. భోజనం ముగిసిన గంటన్నర నుండి ప్రతీ గంటకూ ఒక గ్లాసు నీరు తాగాలి.

👉🏻 అన్నం లో 50% కూర తినాలి. ఆకు కూరలు ఎక్కువ వాడాలి. ఉప్పు,  కారం,  నూనెలు బాగా తగ్గించాలి.

👉🏻 రుచి కోసం పల్లీ పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మినుముల పొడి కలుపుకోవాలి.

👉🏻 మాంసం, చాపలు, కోడి గుడ్డు, నిల్వ పచ్చడి, బిర్యానీలు, పాకెట్ పాలు వాడవద్దు.

👉🏻 సాయంత్రం నాలుగున్నర గంటలకు గ్లాస్ జ్యూస్ తాగాలి.

👉🏻 సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు గ్లాసుల నీరు తాగాలి.

👉🏻 సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం తినడం పూర్తి కావాలి.

👉🏻 రాత్రి డిన్నర్ లో పండ్లు తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి తినాలి.

👉🏻 వీలుని బట్టి రోజులో మూడు నుంచి నాలుగు గ్లాసులు మజ్జిగ తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: