దేశంలో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే నంటూ విమాన‌యాన అధికారులు చెబుతున్నారు. మే 31 త‌ర్వాతనే విమాన‌, రైల్వే స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఇప్ప‌టి కే కేంద్ర విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. లాక్‌డౌన్‌4.0 ద్వారా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది. అయితే రైల్వే స‌ర్వీసుల విష‌యంలోనే కొంత ఆల‌స్యం జ‌రిగినా విమాన స‌ర్వీసుల‌ను త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్లు తెలు స్తోంది. ఈ నేప‌థ్యంలోనే విమాన ప్ర‌యాణాల విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించేలా ప్ర‌త్యేక ఏర్పాట్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అధికారులు రూపొందిస్తున్నారు. 

 

ప్ర‌యాణానికి  దాదాపు రెండు గంట‌లు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. కొవిడ్‌-19కి సంబంధించి సమగ్ర ప్రశ్నావళికి సమాధానాలివ్వాలి. ముఖ్యంగా జ‌ర్నీ హిస్ట‌రీకి సంబంధింన విష‌యాలేవీ దాచొద్దు. క‌రోనా టెస్టుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. క్యాబిన్‌ బ్యాగేజీని వెంట‌ తీసుకెళ్లడానికి వీల్లేదు. మీ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలి.  శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రయాణికులతో పాటు పైలట్లు, విమాన సిబ్బందికి కూడా నిబంధనలు వర్తింపజేయనున్నారు. భద్రతా సిబ్బంది, విమానాశ్రయ నిర్వహణ సిబ్బందికి వర్తిస్తాయని, విమానాశ్రయాల్లో భౌతిక దూరం నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ముసాయిదాలో నిర్ణయించారు. 

 


దేశంలో విమానయాన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకుగాను స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)తో పౌర విమానయాన శాఖ ఈ మేరకు ముసాయిదాను సిద్ధం చేసింది. ఇదిలా ఉండ‌గా సీటింగ్ క్ర‌మంలోనూ మార్పులకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. విమానంలో మూడు వరుసలు ఖాళీగా ఉంచాలని నిర్ణ‌యించారు. భౌతిక దూరం పాటించేందుకే ఈ విధానాన్ని అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు విమాన‌యాన అధికారులు పేర్కొంటున్నారు.  ఇకపై మనం విమానం ఎక్కితే పక్కపక్కనే కూర్చోలేం.. సీటింగ్‌ కొత్తగా ఉంటుంద‌ని చెబుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విమాన‌యాన రంగం దారుణంగా దెబ్బ‌తింది. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: