క‌రోనా పాజిటివ్ కార‌ణంగా మ‌ర‌ణించిన వృద్ధురాలితో స‌న్నిహితంగా ఉన్న మ‌రో ఇద్ద‌రు వృద్ధులు విష‌యం దాచిపెట్టారు. తాము వృద్దురాలిని క‌లిసిన విష‌యం బ‌య‌ట తెలిస్తే క్వారంటైన్‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. అధికారుల‌కు చుట్టూఉన్న‌జ‌నం, వైద్యుల క‌ళ్లుగ‌ప్పినా  త‌మ‌కు పాకిన క‌రోనాను మాత్రం దాచ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ఇటీవ‌ల ఒక‌రు క‌రోనాతో మ‌ర‌ణించ‌గా మ‌రొక‌రికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ సంఘ‌ట‌న మ‌రెక్క‌డో కాదు హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఏం జ‌రిగిందంటే.. జియాగూడలో ఓ వృద్ధురాలు పింఛను కోసం బ్యాంకుకు వెళ్లి అటు నుంచి సరకుల కోసం రేషన్‌ దుకాణానికి వెళ్లింది. 


కొద్దిరోజులకే అనారోగ్యానికి గురైన ఆమె మ‌ర‌ణించింది. మ‌ర‌ణించాక నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో ఆమెకు క‌రోనా ఉంద‌ని నిర్ధార‌ణ కావ‌డంతో ఆమె జ‌ర్నీ హిస్ట‌రీని అధికారులు ప‌రిశీలించారు. ఆమెతో స‌న్నిహితంగా మెదిలిన వారంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు. అయితే  అదే ప్రాంతంలోని మరో ఇద్దరు వృద్ధులూ ఒకేచోట వ్యాపారాలు నిర్వహించేవారు. ఖాళీ సమయాల్లో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకునేవారు. ఇద్దరూ కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఇదిలా ఉండ‌గా మంగళ్‌హాట్‌లో స్నేహితులు, బంధువులు సరదాగా కాలక్షేపం చేయటం ద్వారా ఏకంగా 10 మంది క‌రోనా బారిన‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఓ యువకుడి ద్వారా ఓకే కుటుంబంలోని 15 మందికి కొవిడ్‌ సోకిన‌ట్లుగా అధికారులు ధ్రువీక‌రించారు. 


అలాగే నిర్మాణ ప‌నుల్లో పాల్గొంటున్న కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల కార్మికులకు వేతనాలు పంపిణీ చేశారు. కొద్దికాలంగా వారు అనారోగ్యంతో ఉండ‌టంతో వైద్యులు స‌మాచారం అందుకుని వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనాగా నిర్ధార‌ణ అయింది. వారితో స‌న్నిహితంగా మెదిలిన వారంద‌రినీ ఇప్పుడు క్వారంటైన్‌కు త‌ర‌లించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. గ‌డిచిన 24గంట‌ల్లో హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలో దాదాపు 40కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో దాదాపు కొంత‌మంది వ‌ల‌స కార్మికులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: