ఈ భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణం `ఉప్పు`. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఇక‌ ఉప్పు అంటే రోజువారీ కూరల్లో వేసుకునే ఓ పదార్థంగా మనం భావిస్తాం. అస‌లు ఉప్పు లేనిదే మ‌న వంట పూర్తి కాదు. అయితే ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే, అది మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వచ్చేలా చేస్తుందట. అలాగే మ‌న శ‌రీరంలో ఉప్పు శాతం పెరిగే కొద్దీ రక్త ప్రవాహం వేగం పెరగడం ప్రారంభమవుతుంది. 

 

ఇది అధిక రక్తపోటు సమస్యను సృష్టిస్తుంది. మూత్రపిండాలలో లోపాలకు కారణమవుతుంది. రక్త నాళాలలోని సూక్ష్మ కణాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. ఇక సాధారణంగా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి మధుమేహం వస్తుందనేది ఇప్పటి వరకు ఉన్న నమ్మకం. అయితే, ఇప్పుడా జాబితాలోకి ఉప్పు కూడా వచ్చి చేరింది. అవును! ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

 

అలాగే ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరుగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని వివరించారు. ఇక ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే, రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు (1.25 చెమ్చాలు), అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందని పేర్కొన్నారు. సో.. ఉప్పు వాడే విష‌యంలో కాస్త జాగ్ర‌త్త వ‌హించండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: