హై బ్లడ్ ప్రెజర్(హైబీపీ).. దీన్నే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శ‌రీరంలో విస్త‌రిస్తుంటుంది. ప్ర‌ధానంగా ఒత్తిడి వ‌ల్ల హైబీపీ వస్తుంద‌రి నిపుణులు అంటున్నారు. మ‌రియు పొగతాగడం, మద్యం సేవించడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటి వాటి వల్ల హైబీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి అందుకు తగిన విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే.. చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే.. హైబీపీ రాగానే ఈ సమస్యకి తోడుగా మరికొన్ని మన శ‌రీరంలోకి చేరతాయి. ముఖ్యంగా హైబీపీ సమస్య ఉన్న వారి శరీరంలోని రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. 

 

దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోతాయి. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అందుకే ఈ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో హైబీపీ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు. మ‌రి ఈ హైబీపీ ప్ర‌భావం ఉంటుందా..? ప్రెగ్నెన్సీ టైం లో హైబీపీ ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్త‌వానికి తల్లికి హైబీపీ ఉన్నా కూడా పిల్లలు ఆరోగ్యంగానే పుడతారు. 

 

కానీ, బీపీ రెగ్యులర్ గా మానిటర్ చెయ్యకపోతే మాత్రం తల్లికీ, బిడ్డకీ కూడా చాలా డేంజ‌ర్ అవుతుంది. ఒక్కొక్కసారి ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశముంటుంది. లేదా, బరువు తక్కువగా పుట్టే అవకాశముంటుంది. అంతేకాదు, బీపీ రి రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ, తగిన మందులు తీసుకుంటూ ఉండకపోతే గర్భిణీలు మూర్ఛ వ్యాధి బారినపడే ఛాన్స్ ఉంది. హైబీపీ ఉన్న ప్రెగ్నెంట్ వుమన్ తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదిస్తూ, వారి పర్యవేక్షణలో ఉండటం ఉత్త‌మం అంటున్నారు నిపుణులు. మ‌రియు పళ్ళూ, కూరగాయలూ, ఆకుకూరలూ ఎక్కువ తీసుకోడం మంచిది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: