సాధార‌ణంగా ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఇలా అనేక సంద‌‌ర్భాల్లో కొందరు స‌డెన్‌గా గుండెనొప్పితో బాధపడుతున్నారు. గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవడం వలన వొచ్చే నొప్పినే గుండె నొప్పి లేదా గుండె పోటు  ఛాతీలో అకస్మాత్తుగా వచ్చే నొప్పి ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. మామూలుగా వచ్చే నొప్పులతో పోలిస్తే గుండెనొప్పి వంద రెట్లు ఎక్కుగా ఉంటుంది. దీంతోపాటు ఎడమ చేయి లాగడం గుండెపోటు ముఖ్య లక్షణం. ఎక్కువ మందికి గుండె నొప్పి వచ్చినా అది గ్యాస్‌ నొప్పి అనుకుని గ్యాస్‌ ట్యాబ్లెట్లు వాడి ప్రమాదానికి గురవుతున్నారు. 

 

అయితే మొదటిసారిగా గుండెపోటు వచ్చినప్పట్నుంచీ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇటీవ‌ల గుండెపోటుల గురించి చేసిన పరిశోధనల్లో కొన్న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అవేంటంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఏ రోజులో అయినా సరే గుండెపోటు వచ్చిన వారికంటే శని, ఆదివారాల్లో గుండెపోటు వచ్చిన వారు మాత్రం బతికే అవకాశాలు తక్కువ అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు. ఈ పరిశోధనలో భాగంగా.. వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూడు వేల మందికి చెందిన డేటాను సేకరించి విశ్లేషించారు. 

 

ఈ క్రమంలో వచ్చిన ఫలితాలను బట్టి సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. మిగతా రోజుల కన్నా శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండెపోటు వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే బతికారని వెల్లడైంది. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు. కాగా, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గుండెపోటు ఎక్కువ మందికి రావటమేగాక మరణించే వారి శాతం కూడా ఎక్కువగా ఉంది. మనదేశంలో పొగతాగే వారి శాతం ఎక్కువగా ఉండటంతో గుండెపోటుకు గురవుతున్నారు. మ‌రియు పాట్‌ బెల్లీ వ‌ల్ల కూడా ఇక్క‌డ చాలా మంది గుండెపోటుకు గుర‌వుతున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: