పచ్చి కొబ్బరి పాలు ... దీని వలన అనేక పనికి వచ్చే గుణాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలు ముక్యంగా అలసటను తగ్గించడంలో చాలా ఉపకరిస్తాయి. పిల్లలకు మూడేండ్ల వయసు నుంచి  అటుకులు, కొబ్బరిపాలు, బెల్లం కలిపిన బలవర్ధకమైన ఆహారాన్ని పెరిగే వారికందిస్తే మంచిదని ఆయుర్వేద పండితులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాకుండా పచ్చి కొబ్బరి నుంచి తీసిన నూనె తాగితే క్షయ వ్యాధి బాగా తగ్గుతుందట. అలాగే ఎండు కొబ్బరి నుంచి తీసిన నూనెతో తలకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని కొద్దీసేపు పుక్కలిస్తే వారికీ దంత వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి.

 

ఇక అలాగే కొబ్బరి నూనె తరచు  జట్టుకు రాయడంతో జుట్టు రాలిపోవడం, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు దగ్గరికి రావు. అలాగే మార్కెట్‌లో దొరికే నూనెల కంటే స్వయంగా మనమే తయారు చేసుకోవడం లేదా తయారీదారుల వద్ద కొని ఉపయోగించడం చాలా మేలు. ముఖ్యంగా కల్తీ సరుకుల నుంచి దూరంగా ఉండండి. ఇక అలాగే చెట్టుమీద బాగా ముదిరి కట్టిన కాయను ఆహారంలో అప్పుడప్పుడు ఉపయోగిస్తే అందులోని నూనె కారణంగా పొత్తి కడుపు పూర్తిగా శుభ్రం అవుతుంది.

 


ఇక ఇది వాతాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బెర అధికంగా దొరుకుతున్న కారణంగా కేరళలో కురిడి కాయల నూనెను వంట నూనెగా చాలా మంది ఉపయోగిస్తారు. అంతే కాకుండా కొబ్బరి పువ్వును సాధారణంగా దేవాలయంలో విగ్రహాల పటాలకు ఆలకరణంగా వాడుతారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేత కొబ్బరి పువ్వులను స్వీట్స్ తయారీలో ఎక్కువగా వాడుతారు. అంతేకాదు కొబ్బెరి బెల్లం కూడ ఆరోగ్యానికి చాలా చాలా మంచింది. ఇక అందులో ఉండే కొబ్బరి పువ్వును మెత్తగా నూరి కరక్కాయ పరిమాణంలో రోజూ రెండు పూటలా ఆహారంలో తీసుకుంటే మూత్రాశయంలో రాళ్ళు చాలా వరకు కరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: