కాకర అనగానే చాలామందికి మొఖం అలా అయిపోతుంది. కానీ ఇది దోస జాతికి చెందిన ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అందరికీ తెలిసిన విషయం కూడా. మనకు రెండు రకాల కాకరకాయలు లభిస్తాయి. ఇక అందులో పొట్టిగా ఉండే కొసలు కొనదేరి ఉండే భారత జాతికి సంబంధించిన కాకరకాయలు, మరొకటి చైనా వెరైటీ ఇందులో కాకరకాయ కాస్త పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా అందులో కొసలు అంతగా కొనదేరి ఉండవు. 

 

IHG


ఇంకా వీటిని వండేటప్పుడు కూరలో చేదు పోవడానికి వాటిని తరిగి ముందుగా ఉప్పులో వేస్తారు. అలాగే వాటిని వండేటప్పుడు కూడా కూరలో బెల్లం, చక్కెర వంటివి కూడా ఉపయోగిస్తారు. దీనితో పులుసు లేదా వేపుడు అలాగే కొన్ని కూరలు బాగా చేసుకోవచ్చు. వీటిని ఎలా అయినా సరే వండుకుని తింటే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా లభిస్తాయి.

IHG

 

అందుకే వైద్యులు కూడా వీటిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినమని చెబుతుంటారు. ఇక నిజానికి చాలా మంది షుగర్ పేషెంట్లు కాకరకాయ రసం తాగుతారు అంటే మీరు నమ్మండి. కాకరకాయలో అనేక విటమిన్లు, మినరల్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతే కాక ఇందులో అనేక రకాలైన ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి లాంటి అనేక విటమిన్లు మనకు లభిస్తాయి. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా వంటి అనేక సంబంధిత వ్యాధులకు బాగా నివారణ ఇస్తుంది. ముఖ్యంగా మనకు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: