ఉల్లిపాయ.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ.. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు. కానీ, ఇప్పుడు మాత్రం అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది. ఈ క్ర‌మంలోనే ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌లో విటమిన్లు ఎ, బి మరియు సి కలిగి ఉంటాయి. 

 

అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, అయోడిన్, భాస్వరం మరియు సల్ఫర్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఉల్లిపాయే కాదు.. ఉల్లిపాయ టీ కూడా ఆరోగ్యానికి చాలా మందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సాధార‌ణ టీకి బ‌దులుగా ఉల్లిపాయల టీ తాగితే ఎన్నో బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ఉల్లిపాయ‌ల టీని తాగితే మంచిది. వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. 

 

ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఉన్న వారు కూడా ఉల్లిపాయ‌ల టీ తాగితే వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. హైబీపీ ఉన్న‌వారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ టీ ఎంతో మంచిది. మ‌రి ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న ఉల్లిపాయ టీ ఇలా చేసుకోండి.. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి. తర్వాత మ‌రుగుతున్న నీటిలో త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి రెండు నిమిషాల త‌రువాత దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు మ‌రియు  చిన్న చిన్న పీసులుగా క‌ట్ చేసిన‌ బిర్యానీ ఆకు వేయాలి. దీనిని ప‌ది నిమిషాల పాటు మరిగిస్తే.. ఉల్లిపాయ‌ల టీ త‌యారైన‌ట్లే. ప్ర‌తి రోజు ఒక క‌ప్పు ఉల్లిపాయ టీ తాగితే.. పైన చెప్పుకున్న ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌న్నీ పొందొచ్చు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: