గ‌ల్ఫ్ దేశాల్లో క‌రోనా కల్లోలం కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి‌ రోజురోజుకు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా వైరస్ సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అత్యధిక కేసులు మక్కా, దమ్మం, జెడ్డా, జుబైల్, మదీనాలో నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 40 వేల‌కు చేరువ‌లో ఉంది. అయితే మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం ఆశాజ‌న‌క‌మైన విష‌యంగా చెప్పాలి. అయితే శుక్ర‌వారం ఒక్క‌రోజే 624 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 

 


ఈ 624 కొత్త కేసుల‌తో క‌లిపి యూఏఈలో క‌రోనా బాధితుల సంఖ్య 37,642కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,337కి చేరింది. అలాగే మ‌రో 17,031 మంది క‌రోనా బాధితులు దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం సంభ‌వించిన ఒక‌ మ‌ర‌ణంతో‌  274కు చేరుకుంది మ‌ర‌ణాల సంఖ్య‌. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి యూఏఈ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌‌ టెస్టులు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 2 మిలియ‌న్‌కు పైగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం విశేషం. ఒక్క‌ శుక్ర‌వార‌మే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 44,000 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

 


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు  పెరిగి పోతూనే ఉన్నాయి.  మొత్తం పాజిటివ్ కేసులు 67 లక్షలా 28 వేల 524కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకుని సాధార‌ణ ఆరోగ్య స్థితికి చేరుకున్న‌వారు 32 లక్షలా 71 వేలా 210 మంది ఉండ‌టం విశేషం. అంటే స‌గానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌న్న‌మాట‌. అయితే మరణాల సంఖ్య 3 లక్షలా 93 వేల 675గా ఉంది. వివిధ దేశాల‌కు చెందిన క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌లు భ‌య‌పెడుతున్నాయి. తాజా అప్‌డేట్స్ ప్ర‌కారం ఈవిధంగా ఉన్నాయి. అమెరికాలో 1,872,660 కేసులు న‌మోదు కాగా , 108,211 మరణాలు సంభ‌వించాయి. ఆ త‌ర్వాతి స్థానంలో బ్రెజిల్లో 614 , 941 కేసులు న‌మోదు కాగా 34,021 మంది నేటికి మ‌ర‌ణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: