మండు వేసవికాలంలో తియ్యదనానికి చిరునామాగా ఉండే ఈ పనసపండు తొనలను తినేందుకు ఆసక్తిని కనపరచని వారు ఎవ్వరు ఉండరు. సాధారణంగా ఈపండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. దేశంలో పనస పండు అంటే ఇష్టపడని వారు ఉండరు.. ఎంతో అద్భుతమైన సువాసనతలో కమ్మనైన ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.  సాధారణంగా ఈపండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్లకన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు మనకు అందిస్తుందని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఈ పనసపండులో ఎన్నో పోషకాలు ఉన్న నేపధ్యంలో ఈ పండు తొనలు మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను నయంచేయడంలో ఈ పనస తొనలు సహాయం చేస్తాయి. 

IHG's official <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DRY FRUITS' target='_blank' title='fruit-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>fruit</a> - The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDUS' target='_blank' title='hindu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindu</a> BusinessLine

పనస పండును తరచూ తినేవారికి ముడతలు ఏర్పడకుండా చర్మం మంచి కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పనస పండ్లులోని తొనలు  బాగా తియ్యగా  ఉన్నప్పటికే  షుగర్ లెవల్స్‌ను పెంచవు అన్న విషయానికి ప్రామాణికంగా వీటిలో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి అని చెపుతున్నారు. దీనితో ఈపండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయన్న భయం చెందాల్సిన అవసరంలేదు అని లేటెస్ట్ అధ్యయనాలుచెపుతున్నాయి. 

IHG

పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు క్యాన్సర్ రాకుండా చూస్తుంది.పనస తొనలు తినే అలవాటు టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వయస్సు పెరగడంతో చాలమందికి  చర్మంపై ముడతలు రావడం సహజంగా  కనిపించే పరిణామం. 

మరింత సమాచారం తెలుసుకోండి: