రానున్న ప‌ది రోజుల్లో భార‌త్‌లో మ‌ర‌ణాల‌శాతం పెరుగుతుంద‌ని బ్రిట‌న్‌కు చెందిన ఓ మీడియా సంస్థ అంచ‌నా వేస్తూ క‌థ‌నం ప్ర‌చురించింది. భార‌త్‌లో  గడిచిన 24 గంటల్లో 9,971 పాజిటివ్‌ కేసులు.. 287 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన విష‌యం తెలిసిందే. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడు రోజులుగా వ‌రుస‌గా 9వేలకు పైగా  కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్లో 2,46,628 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. వివిద కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,20,406 మంది చికిత్స పొందుతున్నారు. అదే స‌మ‌యంలో  1,19,293 మంది కోలుకుని ఆరోగ్యవంతులుగా మారి ఇళ్ల‌కు చేరిన‌ట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో పోరాడి 6,929 మంది ప్రాణాలు విడిచారు.


 చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకు ఉధృత‌మ‌వుతోంది. భార‌త్‌లో గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 287 మరణాలు సంభవించాయి. దీంతో  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6642కి చేరింది. ఇదిలా ఉండ‌గా మహారాష్ట్రలో అత్యధికంగా 82968 కేసులుండగా... త‌ర్వాతి స్థానంలో తమిళనాడులో... 30152 ఉన్నాయి. ఢిల్లీలో 27654, గుజరాత్‌లో 19592, రాజస్థాన్‌లో 10331, ఉత్తరప్రదేశ్‌లో 9733, మధ్యప్రదేశ్‌లో 9228, బెంగాల్‌లో 7738 పాజిటివ్ కేసుల్లో వ‌రుస‌గా ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక వేగంగా కేసులు న‌మోదవుతున్న దేశాల్లో  బ్రెజిల్, అమెరికా తర్వాత భార‌త్ మూడోస్థానంలో ఉంది. 


అలాగే... మొత్తం కేసుల్లో ఆరో స్థానంలో ఉంది. ఇండియా కంటే ఎక్కువగా అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ మాత్రమే ముందున్నాయ‌ని ఐరాస అనుబంధ  ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో వ‌చ్చే మూడురోజుల్లో కేసుల సంఖ్య పెరుగుతుంద‌ని, దీంతో మూడో స్థానానికి చేరుకుంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా వేస్తోంది. ఇక రోజువారీ మరణాల్లో భార‌త్ నాలుగో స్థానంలో  ఉంది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌లో 12వ స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే భార‌త్‌లో ఇదే రీతిన‌క‌రోనా గ‌ణాంకాలు న‌మోదైతే ఇటలీ కంటే మిన్న‌గా క‌ష్టాలు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: