గుండె ఆరోగ్యంగా ఉండ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. కానీ, ఇటీవ‌ల కాలంలో అతి త‌క్కువ వ‌య‌స్సులోనే చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అందుకే నయం చేయడం కంటే.. అరికట్టడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. హార్ట్ ఎటాక్ ని కూడా అరికట్టవచ్చు. కొన్ని అలవాట్ల వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ కి దూరంగా ఉండవచ్చని.. అంటున్నారు నిపుణులు.గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలు, ఆరోగ్యకర జీవనశైలి మాత్రమే కాకుండా కొన్నిరకాల జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

 

అందులో ముందుగా మనం డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అంటే విష‌ప‌దార్థాలు అని అర్థం కాదండోయ్‌.. ఫ్రైలు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ టేస్టీగా ఉండ‌డంతో పాటు కొవ్వు కూడా ఎక్కువే.  ఇవి ఎక్కువగా తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు... రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. సో.. వీటికి కాస్త దూరంగా ఉంటే బెట‌ర్‌. 

 

అలాగే కొబ్బరి, కొబ్బరినూనె, అవకాడో, గుడ్డులోని పచ్చసొన, వెన్న, నట్స్, మాంసం, బాదాం, పచ్చి పాల ఉత్పత్తుల ద్వారా హెల్తీ ఫ్యాట్ పొందవచ్చు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి డైలీ డైట్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్ ఎటాక్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అందుకు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.

 
 
 

  

మరింత సమాచారం తెలుసుకోండి: