మానవ శరీర దోషరహితంచేసే శుద్ధి చేయగల శక్తి అపారంగా ఉంది అనడంలో అతిశయక్తి లేదు.  మన శరీరానికి వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేయగల సత్తా ‘నిమ్మ’.  నిమ్మ ప్రస్తావన తీసుకు రాగానే మీకు నోట్లో నీళ్లూరుతూ వుంటాయి.  నిమ్మ రుచికి పుల్లగానే ఉంటుంది కానీ.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు. వంటలకు మాత్రమే కాదు.. సౌందర్యానికి కూడా అదనపు అందం తెచ్చే శక్తి నిమ్మకాయలో ఉంది. అన్ని సీజన్‌లలో దొరికే నిమ్మ ఏ సీజన్‌కైనా ఆ సీజన్‌కు తగ్గట్టు శరీరానికి మేలు చేస్తుంది. తేనెలో లభించే కార్బొహేడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మరి దాని విశేషాలు తెలుసుకోవాలని ఉందా..

 

తలలో వేడి తగ్గేందుకు నిమ్మరసం

    ఆముదంలో కొద్దికొద్దిగా నమ్మరసం నూరి, పూర్తిగా కలిసి పోయాక, ఆ ఆముదాన్ని తలకు మర్దన చేస్తే తలలో వేడి తగ్గి, చలవని కల్గిస్తుంది. కళ్ల మంటలు, తలనొప్పి, మూర్ఛలు, ఆపస్మారకం, ఫిట్స్, తలతిరుగుడు వంటి వ్యాధులు తగ్గుతాయి.  పళ్లలోంచి రక్తం కారడానికి అనేకం కారణాలు ఉన్నాయి.   సి.విటమిన్ లోపించడం, ఇప్పడు మార్కెట్లో దొరికే టూత్ పేస్ట్ లు కొన్ని సరిపడకపోవడం మరో కారణం. పేస్ట్ పడకపోతే చిగుళ్లలోంచి రక్తం కారడం జరగవచ్చు.  నిమ్మరసాన్ని తాగితే పళ్లలోంచి రక్తం కారడం, చిగుళ్లు మెత్తపడం, వాయటం తగ్గుతాయి.

 

రక్తవృద్ది కోసం :

       రక్తక్షీణతలో నిమ్మరసం అతి ముఖ్యమైనది.  రక్తక్షీణత తగ్గి రక్తం బాగా పుష్టిగా పట్టేందుకోసం ఇనుముకు సంబంధించిన ఔషధాలనిస్తారు.   ఈ ఇనుము శరీరానికి బాగా వంటపట్టడానికి నిమ్మరసాన్ని తీసుకొంటే ఆ ఔషధం బాగా పనిచేస్తుంది.  మీ వైద్యలు వ్రాసిన మందులు వేసుకొని నిమ్మరసం తాగండి అంతే ..

 

నిమ్మరసంతో ఎలర్జీని దూరం చేసుకోండి

    నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది అని చాలా మంది అంటుంటారు. కొందరి విషయంలో అది నిజమే ! కానీ, నిమ్మరసం తాగితే అలాంటి సమస్యలు ఉన్న వారు తగినంత  నిమ్మరసం తాగితే అలాంటి ఎలర్జీ దోషాలు తగ్గుతాయి.  కాబట్టి ఎలర్జీ బాధలు పడేవారు, తమకు అలా నిమ్మరసం తాగిలే ఆరోగ్యానికి సరిపడుతుందో లేదు పరీంక్షించుకొని ఒకవేల జలుబు చేసే లక్షణాలు కనబడితే మానేయాలి.. లేకుంటే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరం. 

 

కామెర్లకు నిమ్మరసం మంచిది

     లివర్ వ్యాధులు, ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో నిమ్మరసాన్ని చక్కగా తీసుకోవచ్చు. నిమ్మ, బత్తాయి, కమలా ఫలాలను ఎంత ఎక్కువగా తీసుకొంటే  ఈ వ్యాధిలో అంత మంచిది.  షుగర్ ఉన్న వారికి కామెర్లు వస్తే వారు నిమ్మరసం తీసుకొంటే చాలా మంచిది ! అంతే కాకుండా మూత్రంలో వేడి, మంట, పచ్చదనం కూడా తగ్గుతాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: