ఇటీవ‌ల కాలంలో ఎవ‌రి చేతిలో చూసినా.. మొబైల్ ఫోన్సే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అర‌చేతితో ప్ర‌పంచాన్ని ఆప‌లేము కానీ.. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ మూల‌న ఏం జ‌రిగిందో.. అర‌చేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌లో చూసేయ‌వ‌చ్చు. ఇక ప్రస్తుతం సమాజంలో అర్థరాత్రి వరకు స్మార్ట్‌ఫోన్లే ప్రపంచం. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఇక ఇంట్లో లైట్లన్నీ ఆర్పేసినా, సెల్‌ఫోన్‌ లైటింగ్‌ మాత్రం వెలుగుతూనే ఉంటుంది. అయితే రాత్రిళ్లు లిమిట్‌గా ఫోన్ చూస్తే ప‌ర్వాలేదు గాని.. అతిగా చూస్తే మాత్రం మీరు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టే అవుతుంది.

 

అతిగా మొబైల్ ఫోన్ వాడ‌డం వ‌ల్ల.. దీనిలో నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మొదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన ‘గ్లియోమా' అనే కణితులు ఏర్పడి, మెదడు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడానికి ఆ రేడియేషన్ ప్రేరేపిస్తుంద‌ట‌. అలాగే రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు చూస్తూ ఆలస్యంగా లేస్తుంటారు కొంద‌రు. ఇది మెదడుపై దుష్ప్రభావం చూసే అవకాశం ఉంది. ఈ అలవాటు మిమ్మల్ని డిప్రషన్‌లోకి కూడా తీసుకెళ్లవచ్చు.

 

ఇక మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. అతి మొబైల్ ఫోన్ వాడ‌డం వ‌ల్ల అందులో నుంచి వ‌చ్చే రేడియేషన్ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం లేదా స్పెర్మ్ నాణ్యత లోపిస్తుందని పరిశోధకులు తెలిపారు. అదేవిధంగా, మొబైల్‌ ఫోన్‌ని మితిమీరి వాడితే మీ రక్తపోటు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ వాడకం బిపి పెరుగుదలకు, తత్పలితంగా గుండె సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు బ్లూ ఫోన్ లైట్ స్ర్కీన్ చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి. మ‌రియుఈ లాక్‌డౌన్‌లో ఎక్కువమంది రాత్రి సమయాల్లోనే ఫోన్ స్ర్కీన్ చూస్తున్నారని తెలుసుకున్నారు. దీనివల్ల చాలామంది నిద్రలేమి సమస్య కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: