మధుమేహం... ప్రపంచంలోనే అతి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మధుమేహం సమస్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మధుమేహం అనేది వస్తుంది. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఈ మధుమేహం మనకు అట్టాక్ అయ్యింది అంటే మనం ఏం చెయ్యలేం. మనం ఇష్టపడి తాగే కాఫీ నుండి తినే స్వీట్ వరకు ప్రతి సారి ఆలోచించాల్సిందే. అలాంటి రాక్షసి ఈ మధుమేహం. మరి అలాంటి ఈ మధుమేహం తగ్గాలి అంటే ఏం చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కరోనా కాద.. మధుమేహం అదుపులోకి రావాలి అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.. మొదటి నుండి వ్యాయామం చేసేవారికి మధుమేహం ముప్పు కాస్త తక్కువ ఉంటుంది. 

 

సమయానికి ఆహారం తీసుకోవటం.. సమయానికి మందులు వెయ్యడం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దీని వల్లే బరువు అదుపులో ఉంటుంది. 

 

మధుమేహం ఉన్నవారు చెప్పులు లేకుండా అసలు నడవకూడదు. ఎందుకంటే పాదాలపై చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు ఇలాంటివస్తే కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పాదాలను కాపాడుకోగలరు. 

 

గోళ్లు తీసే సమయంలో చిగురు గాయం కాకుండా చూసుకోవాలి. లేకుంటే చర్మ సమస్యలు వచ్చేస్తాయి. 

 

మధుమేహం ఉన్నవారికి కిడ్నీ సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోవడం మంచింది. 

 

కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉన్న మాంసం, గుడ్లు తినడం మానేయడం మంచిది. 

 

ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. 

 

తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు తినకుండా ఉండడం మంచిది. 

 

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.

 

ఇవి అన్ని క్రమం తప్పకుండ పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: