మన దైనందిన జీవితంలో నీరు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మనిషికి జీవన ఆధారం నీరు. ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి  రోజు నీరు త్రాగడం చాలా ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. ఇక సరైయన మోతాదులో నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే స్నానానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుంది. 

 

ఆహారం తినేందుకు అరగంట ముందు గ్లాసుడు మంచినీళ్లు తాగితే.. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా నీరు తాగ‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే నీళ్లు తాగే విష‌యంలోనూ కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. లేకుండా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా చాలా మంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. మ‌రికొంద‌రు హడావుడిగా నీళ్లు తాగేస్తుంటారు. కానీ, ఇలా చేయ‌డం ఆరోగ్యానికి చాలా డేంజ‌ర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిల‌బ‌డి తాగిన‌పుడు ఎక్కువ శాతం నీరు ఎముక‌ల కీళ్ల‌లో చేరిపోయి ఆర్థరైటిస్ క‌లిగించే ప్ర‌మాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అందుకే  నీరు తాగేటప్పుడు కూర్చుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే శ‌రీరంలో అన్ని భాగాలకు, క‌ణాల‌కు, కండ‌రాల‌కు నీరు స‌మంగా అందుతుంది. మూత్ర‌పిండాలు కూడా కూర్చుని తాగిన‌పుడు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ట‌. అదేవిధంగా, నీళ్లు తాగుతున్న‌పుడు హ‌డావుడిగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది. మ‌రియు చ‌ల్ల‌ని నీరు కాకుండా కాస్త వేడిగా ఉన్న నీరు లేదా గోరు వెచ్చ‌గా ఉండే నీరు తాగడం వ‌ల్ల ర‌క్త‌నాళాల శుద్ధి, కొవ్వు ప‌దార్థాలు తొలగిపోతాయి. ఇక . బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఏదైనా సరే ఆహారం తిన్న గంటవరకు నీళ్ళు తాగకూడదు ఎందకంటే మనం తిన్న ఆహారం ప్రేగుల్లోకి వెళ్తుంది అక్కడ జీర్ణ ప్రక్రియ అప్పుడే మొదలౌతుంది. ఆ సమయంలో కనుక నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ నెమ్మదౌతుంది. దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: