హైద‌రాబాద్‌ను క‌రోనా అల్ల‌క‌ల్లొలం చేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ముంబైలో మొద‌ట్లో ఇలానే వంద‌ల్లో మొద‌లైన క‌రోనా కేసులు ఇప్పుడు అక్క‌డ విల‌యాన్ని సృష్టిస్తున్నాయి. గ‌డిచిన ప‌క్షం రోజుల‌ను గ‌మ‌నిస్తే కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా వృద్ధి చెందింది. నిత్యం ఇక్క‌డ‌కు 150కేసుల‌కు పైగానే న‌మోద‌వూతూ వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ఉన్న నాలుగైదు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసూతి ఆస్పత్రి , ప్లేట్ బురుజు హాస్పిటల్ లో 32 మంది వైద్య సిబ్బందికి కరోనాపాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇందులో 18 మంది వైద్యులు, 14 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.

 

తెలంగాణాలో కరోనా పరీక్షలు నిర్వ‌హించేందుకు అర్హ‌త క‌లిగిన ల్యాబులుగా కొన్నింటి వివ‌రాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జిల్లాల వారీగా ఆయా లాబోరేట‌రీలు ఈవిధంగా ఉన్నాయి. హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్,  చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ బోయినపల్లి, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌లు,
లింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్, సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, మేడ్చల్, మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్ ఉన్నాయి.

 

అలాగే బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్, మాధాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్, బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్, సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి, సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ , బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ లో ల్యాబ్ ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న ల్యాబ్స్ వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.. గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్, సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ఇ న్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్, ESIC మెడికల్ కాలేజ్, హైదరాబాద్, కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ ఉన్నాయి.

 

 అలాగే  సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్, సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్ ఆస్ప‌త్రుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. వాస్త‌వానికి ఇందులో ఇప్ప‌టికే ప‌లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో జ‌నాలు ప‌రీక్ష‌లు క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: