రోజుకో యాపిల్‌ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ కూడా పెరుగుతుందని అంటారు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు యాపిల్ ను ఇష్టంగా తింటారు. యాపిల్ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి ని పెంచడమే కాకుండా గుండె పనితనాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. అయితే మార్కెట్లో దొరికే యాపిల్స్ లో చాలా రకాల ఉన్నాయి. వాటిని కొనే ముందు ఒకసారి పరిశీలించి కనుక్కోవడం ఉత్తమం. కొన్న తర్వాత వాటిని శుభ్రపరిచి తినాలి డైరెక్ట్ గా తింటే ప్రమాదమే. అలాగే యాపిల్స్ ను ఫ్రిడ్జ్ లో ఎక్కువ సేపు ఉంచకూడదు, ఒక వేల ఫ్రిడ్జ్ లో పెట్టినా  బయటకు తీసిన 5 నిమిషాల్లో తినాలి. లేదంటే అది ఆరోగ్యానికి హానికరంగా తయారవుతాయి.

 

 

యాపిల్స్‌ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కాని యాపిల్స్‌ను తినే సమయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే మాత్రం ప్రమాదం అంటూ డాక్టర్లు అంటున్నారు.ఇంతకు యాప్సిల్స్‌ ప్రమాదం ఏంటా అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటీ అంటే యాప్సిల్స్‌లో ఉండే విత్తనాలు విషతుల్యంగా ఉంటాయని అంటున్నారు. యాపిల్స్‌లో ఉండే విత్తనాలను ఒకటి రెండు తింటే పర్వాలేదు కాని ఎక్కువగా తింటే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

 

 

ఒక సర్వే ప్రకారం 60 కేజీల బరువు ఉండే 40 ఏళ్ల వ్యక్తి 150 నుండి 175 యాపిల్‌ విత్తనాలు తినడం వల్ల చనిపోతారట.అదే 10 ఏళ్ల లోపు పిల్లలు కనీసం 50 తిన్నా కూడా చనిపోతారని వైధ్యులు అంటున్నారు.అందుకే పిల్లలకు యాపిల్స్‌ తినిపించాలి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు యాపిల్స్‌ ఇచ్చిన సమయంలో అందులో విత్తనాలు లేకుండా చేయాల్సి ఉంటుంది.ఏం కాదులే అనుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: