మధుమేహం.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరికి అయినా మధుమేహం ఉంటుంది. అయితే ఈ మధుమేహం అనేది నిజంగానే అనారోగ్యం కాదట! అది కేవలం శారీరక మార్పు మాత్రమేనట. అయితే ఇప్పుడు దాన్నే నిర్లక్ష్యం చేస్తే ఎన్నో ప్రమాదకర రోగాలు వస్తాయట. అందుకే మహిమేహులు వారి రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. 

 

మధుమేహం ఉన్నవారు ఈ లక్షణాలు ఉంటే పరీక్షలు తప్పనిసరి.. 

 

పదేపదే మూత్రానికి వెళ్లాల్సి వస్తే అకారణంగా బరువు తగ్గుతారు. 

 

అలసట, నీరసం, చూపు మందగించటం వంటి ఉన్న.. 

 

గాయాలు మానకపోవటం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చిగుళ్ళు ఎర్రగా మారి వాపు కనిపించటం.. 

 

కుటుంబ పెద్దల్లో ఎవరికైనా మధుమేహం లేదా ఊబకాయం ఉంటే

 

మితిమీరిన దాహం లేదా ఆకలి ఉన్నవారు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. 

 

ఇంకా ఈ మధుమేహం కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే పెద్ద రక్తనాళాలు మూసుకుపోతే  కాళ్ళలో రక్తనాళాలు దెబ్బతిని గాంగ్రిన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. నరాలు, వాటిపై పొర దెబ్బతిని 'న్యూరోపతి',  రక్తనాళాలు దెబ్బతిని 'వాస్క్యులోపతి' సమస్య ఎదురుకునే అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్య కూడా రావచ్చు. కళ్ళలోని రెటీనా దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. 

 

ఇంకా మధుమేహాలు పాటించాల్సిన జాగ్రత్తలు.. 

 

ఆహారంలో కొవ్వు పదార్థాలు 70 శాతం తగ్గించాలి.

 

ఖాళీ కడుపుతో ఉండకూడదు అలానే కడుపునిండా కూడా తినకూడదు. 

 

ప్రతి 4 గంటలకోసారి విడతల వారీగా ఆహారం తీసుకోవాలి.

 

పీచు పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. 

 

రోజూ 40 నిమిషాలు వ్యాయామం లేదా నడవటం చెయ్యాలి. 

 

బద్దకాన్ని పూర్తిగా వదిలి పెట్టాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 

 

చూశారుగా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు ఆరోగ్యవంతంగా తయారవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: