వాల్‌నట్స్.. సాధార‌ణంగా వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే.. వీటి రుచి కాస్త వ‌గ‌రుగా ఉంటుంది. కానీ,  వాల్ నట్ ఆరోగ్య పరంగా చాలా గొప్పగా సహాయపడుతుంది. చాలా మంది ఈ వాల్ నట్స్ ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తార్. ఈ డ్రైఫ్రూట్ చూడటానికి అచ్చు బ్రెయిన్ పోలికను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. అయితే ఇది అక్ష‌రాల నిజం. ఎందుకంటే మెదడుకు సంబంధించిన సమస్యలను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. అలాగే ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి వాల్‌న‌ట్స్ ఎంతో చ‌క్క‌గా సహాయపడ‌తాయి.

 

అంతే కాదు ప్ర‌తిరోజు వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతుంది. అలాగే రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువని, పని మీద ధ్యాస కూడా పెరుగుతుందని ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇక  బీపీ, హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి వాల్‌నట్స్ ఆహారంలో భాగం చేయగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఇందులో ఉన్న పీచు, బయోయాక్టివ్ పదార్ధాలు బీపీని తగ్గించి గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.

 

అదేవిధంగా, గ‌ర్భ‌వ‌తులు వాల్ నట్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వ‌ల్ల‌ వీటిలో ఉండే కాంపౌండ్స్ పొట్టలో పెరిగే పిండంకు ఎలాంటి అలర్జీలు కలగకుండా చేయ‌డంతో పాటు తగిన వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఇక మ‌రో ముఖం విష‌యం ఏంటంటే.. ఎవరైతే వంద్యత్వంతో బాధపడుతున్నారో అలాంటి వారు వాల్ నట్స్ ను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా హెల్త్ స్పెర్మ్ పొందడంతో పాటు, వాటి కదిలిక సామర్థ్యం, చురుకుగా ఉండేందుకు సహాయపడుతాయి. కాబ‌ట్టి, ప్ర‌తిరోజు క‌నీసం ఐదు అన్నా వాల్‌నట్స్ తిన‌డానికి ప్ర‌య‌త్నించండి.

 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: