జీడిపప్పులు బ్రెజిల్ దేశానికీ చెందినవి.. తరాల నుండి ఇవి వాటి రుచి వలన ప్రసిద్ధిగా  చూడబడతాయి. ఇటీవలి కాలంలో, జీడిపప్పులు వాటి సున్నితమైన రుచి మరియు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల వలన ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందాయి.అయితే, ఉత్పాదకులు జీడిపప్పును ఎప్పుడూ జీడిపిక్క (జీడిపిక్క లోపల జీడిపప్పు ఉంటుంది) రోపంలో విక్రయిస్తారు, జీడిపిక్కలో ఉండే ఒక భాగం రెసిన్ (resin)ను  కలిగి ఉంటుంది, ఇది వినియోగానికి హానికరమైనది. పచ్చివి లేదా వేయించిన జీడిపప్పులు అలాగే రుచికోసం అనేక ఫ్లేవర్లు జోడించిన జీడిపప్పులు కూడా అందుబాటులో ఉంటున్నాయి.

 

వీటిని చిరుతిండిగా తినవచ్చు, సలాడ్లు, స్మూతీస్ మరియు ఇతర ఆహారపదార్దాలతో కలిపి తీసుకోవచ్చు. మీరు ఇతర గింజలు/పప్పుల ప్రయోజనాల కంటే వేరుగా ఉండే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను జీడిపప్పు నుండి పొందవచ్చు. జీడిమామిడి చెట్లు ఈశాన్య బ్రెజిల్లో పుట్టాయి అవి దక్షిణ మరియు మధ్య అమెరికాలకు విస్తరించాయి.  

 

- జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పోతాయి. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు రోజూ జీడిపప్పు తినాలి. దీంతో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరంలో మూడ్‌ను నియంత్రిస్తుంది. మంచి మూడ్‌లోకి వస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

 

- శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

 


- రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు పోతాయి. దృష్టి బాగా ఉంటుంది. గ్లకోమా, శుక్లాల సమస్య రాదు.

- శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. రోజూ జీడిపప్పును తింటుంటే నెల రోజుల్లో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

 


- గుండె జబ్బులు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.

 


- శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను రాకుండా చూస్తుంది.

 


- మన శరీరానికి అవసరం అయ్యే చాలా విటిమన్లు, మినరల్స్ జీడిపప్పు ద్వారా లభిస్తాయి. దీంతో హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: