ఎన్ని ఇంగ్లీష్ మందులు వచ్చినా.. భారతీయ సంస్కృతికి సంబంధించిన కొన్ని ఔషద మొక్కలు వాటి ఫలితాలు దేనికి సాటిరావు.  ఆ కాలంలో మనుషులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారంటే.. ఇంగ్లీష్ మందులతో కాదు.. ప్రకృతి వైద్యం... అడవుల్లో దొరికే దివ్యమైన ఔషద మొక్కలే అని చెప్పొచ్చు.  అలాంటి అద్భుతమైన ఔషద మొక్క నేలవేము.  

 

సారాసారము లెఱుగని బేరజులకు బుద్ధిజెప్పబెద్దలవశమా?
నీరెంత పోసి పెంచినగూరగునా నేలవేము?గువ్వలచెన్నా!

 

శతకంలో ఓ పద్యం ఉంది. ఎంత నీరు పోసినా పెంచినా కూడా నేలవేములో చేదు తగ్గడం ఎలా అసాధ్యమో.... మంచీచెడూ విచక్షణ ఎరుగని ధూర్తులకు బుద్ధి చెప్పాలనుకోవడం అంతే నిరుపయోగం అని ఈ పద్యంలోని అర్థం. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం  రాసిన ఈ పద్యంలో  నేలవేము అనే మొక్క గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.  అయితే ఇది అంత గొప్పదా.. మరి దీని గురించి ప్రతి ఒక్క తెలుగు వారికి తెలియాలే అంటే.. ఇప్పుడు వాడుతున్న ఇంగ్లీష్ మెడిసన్స్ మోజులో పడి ఇలాంటి దివ్యమైన ఔషదాల గురించి మర్చిపోతున్నారు.

నేలవేము ఆసియాకే ప్రత్యేకమైన ఓ చిన్న మొక్క. మొదట్లో ఇది దక్షిణభారతంలోనే కనిపించేదట. దీని ఔషధగుణాలు తెలిసిన తరువాత ప్రపంచమంతటా దీనిని పెంచడం మొదలుపెట్టారు. ఇది ఎలాంటి నేలలోనైనా పండుతుంది. ఎలాంటి కాలంలో అయినా పెరిగే సత్తా ఉండటంతో దీని పెంచేందుకు ఏమంత శ్రద్ధ వహించాల్సిన పనిలేదు. వేము అంటే వేప. నేల మీద పెరిగే చిన్నపాటి మొక్కలలో వేపతో సమానమైన చేదు కలిగి ఉంటుంది కాబట్టి, ఈ మొక్కకి నేలవేము అన్న పేరు వచ్చింది.  ఇది భయంకరమైన చేదుతో కూడుకున్న ఆకు.. సంస్కృతంలో దీనిని మహాతిక్త అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో కాల్మేఘ్ పేరుతో దీనిని విస్తృతంగా వాడతారు. తిక్తక కషాయం, తిక్తఘృతం వంటి మందులెన్నింటినో నేలవేముతో తయారుచేస్తారు.   ఇక నేలవేములో ఉండే విపరీతమైన చేదు వల్ల మధుమేహంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అయితే గర్భిణీ స్త్రీలు నేలవేముని వాడటం వల్ల శిశువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అన్న విషయమై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. 

IHG

నేల వేము యొక్క ప్రయోజనాలు :

 

- నేలవేము యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేయడం వల్ల క్షయ, నిమోనియా వంటి వ్యాధులలో ఉపశమనాన్నిస్తుంది.

 

- ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల చర్వవ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది.

 

- యాంటీ వైరల్ లక్షణాల కారణంగా హెర్పిస్ అనే మొండి సుఖవ్యాధి మీద సైతం ప్రభావాన్ని చూపుతుంది.

 

- జలుబు వంటి కఫ సంబంధ వ్యాధులలో నేలవేము అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలలో కూడా రుజువైంది.

 

- నేలవేము చూర్ణం, కాలేయం పనితీరుని మెరుగుపరిచి కామెర్లని అదుపులో ఉంచుతుందట.

 

- మలేరియా, చికెన్గున్యా వంటి మొండి జ్వరాలలో సైతం నేలవేము ప్రభావం చూపుతుందని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు.

 

- గుండె ధమనులు గట్టిపడిపోయే atherosclerosis అనే స్థితిలో నేలవేముని వాడితే ఫలితం దక్కవచ్చు.

 

- జీర్ణ సంబంధమైన చాలా వ్యాధులలో నేలవేము అద్భుతాలు చేస్తుందన్నది వైద్యుల మాట.

 

- నేలవేము పెరిగే చోట పాములు, దోమల వంటి విషజీవులు దరిచేరవని అంటారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: