సాధార‌ణంగా డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల‌ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటమే. అందులో ముఖ్యంగా పిస్తా ప‌ప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తా పప్పులో మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోష‌కాలు ఉన్నాయి. పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది.

IHG

పిస్తాను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన నేత్ర సమస్యలు తగ్గుతాయి కంటిచూపు స్పష్టంగా ఉండడానికి ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి. శరీరంలో విడుదలైన వ్యర్థాలను పిస్తా పప్పులు దూరం చేస్తాయి. అలాగే పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి. పిస్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. పిస్తా చెడు కొలెస్ట్రాల్, ఎడిఎల్ తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. 

IHG

గుండె జబ్బులు నిరోధించడంలో మంచి కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్‌ బాగా సహాయపడుతుంది. నరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. దాంతో గుండె స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.అదేవిధంగా, పిస్తా ప‌ప్పులో వివిధ రకాలైన పోటెంట్ యాంటీఆక్సిడెంట్స్ తటస్తంగా ఉండి, వృద్ధాప్యం రాకుండా నిరోధిస్తుంది. మ‌రియు రోజూ పిస్తాను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్ ‘ఇ’ను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి చర్మాన్ని సంరక్షిస్తుంది. అందువల్ల ప్రతి రోజు పిస్తా పప్పును తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: