చాక్లెట్.. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినేది చాక్లెట్. అలాంటి చాక్లెట్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చాక్లెట్ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది అంట. అంతేకాదు.. ఈ చాక్లెట్ లో ఉండే కోకో పౌడర్ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. 

 

IHG

 

ఇంకా 100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67 శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89 శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా ఉంటుంది. ఇంకా చాక్లెట్ లో పీచుతో బాటు తగు మోతాదులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బార్ తింటే 600 క్యాలరీలూ శరీరంలో చేరతాయి. అయితే రోజూకు 30 గ్రాములకు మించకుండా మాత్రమే చాక్లెట్ తినాలని నిపుణులు చెబుతున్నారు.  

 

IHG

 

ఇంకా ఈ చాక్లెట్ ఉపయోగాలు ఇవే.. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు తింటే అధిక రక్తపోటు, రక్తం అతిగా గట్టకట్టటం వంటి సమస్యలు ఉండవు. రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను తింటే లోబీపీ కూడా ఉండదు. చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే. అందుకే రోజుకు 30 గ్రాముల చాక్లెట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి.              

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: