ప్రస్తుతం కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన సర్రని డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతున్నారు.. అలా ప్రతిసారి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి.. ఆర్ధికంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. అయితే అలా కాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలు డాక్టర్ అవసరం లేకుండానే ఇంట్లోనే ఆరోగ్యంగా తయారవ్వచ్చు. 

 

IHG

 

చిటికెడు స్వచ్ఛమైన ఇంగువను అయుదు లేదా ఆరు చుక్కల నిమ్మరసంలో కలిపి నూరి దాన్ని దుడిలో పెట్టి నొప్పిగా ఉన్న పంటి కింద పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. 

 

కడుపుబ్బరం, గ్యాస్‌ట్రబుల్ తో త్రేన్పులతో బాధపడితే 100 గ్రాముల వామును సన్నని సెగ మీద ఎర్రగా వేయించి ఆరిన తర్వాత పొడిచేసి డబ్బాలో నిల్వ చెయ్యాలి. ఇంకా త్రేన్పులు వచ్చినప్పుడు చెంచా పొడిని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే వెంటనే త్రేన్పులు ఆగుతాయి.

 

అరుగుదల లేక కడుపు నొప్పి వస్తే చెంచా అల్లం రసం తీసుకొని దానిలో చెంచా తులసి రసం, తేనె తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

 

IHG

 

దానిమ్మ గింజలు చప్పరించి తింటే వేవిళ్ల వాంతులు తగ్గిపోతాయి.

 

ఇంకా నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతి రోజు అరకప్పు నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో నోరుపుక్కిలిస్తే నోటి దుర్వాసన అసలు రాదూ.

 

రాత్రి పడుకోబోయే ముందు 5 గ్రాముల చొప్పున అల్లం, బెల్లం కలిపి తింటే మలబద్దకం సమస్య ఉండదు.

 

IHG

 

అధిక బరువు తగ్గాలంటే మూడుపూటలా ఒక్కో అశ్వగంధ ఆకు నమిలి తింటే బరువు తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: