ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తిఒక్క‌రూ కోరుకుంటారు. ఎందుకంటే.. ఈ సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఇక ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో. కానీ, నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఓ పెద్ద సవాల్‌గా మారింది. అది తినొద్దు, ఇది తినొద్దు, ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి ఇలాంటి చర్చ ఎప్పుడూ జరిగేదే. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం స‌రైన స‌మ‌యంలో తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధార‌ణంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడు లేనిదే మ‌నం లేము.

 

ఈ మూడు తీసుకుంటున్నాం స‌రే.. ఏ టైమ్‌లో తీసుకుంటున్నాం..? అన్న‌ది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ స‌రైన స‌మ‌యంలో తీసుకున్న‌ప్పుడే ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. మ‌రి వీటిని ఏ స‌మ‌యంలో తీసుకోవాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.  ఉదయం నిద్ర లేచిన తర్వాత అరగంటకు అల్పాహారం తీసుకోవడం అనువైనదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనువైన సమయం ఏదీ అంటే ఉదయం 7 గంటలు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 10 గంటల తర్వాత తీసుకోవడం వ‌ల్ల క‌డుపు నింపుతుందేమో కానీ, ఆరోగ్యానికి మంచిది కాదు. 

 

అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట స‌మ‌యంలో లంచ్ చేసేయాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ కు మధ్య కనీసం నాలుగు గంటల సమయం ఉండాలి. లంచ్ ను మూడు, నాలుగు గంటల తర్వాత తీసుకోవడం అస్స‌లు మంచిది కాదు. ఇక‌ డిన్నర్ విష‌యానికి వ‌స్తే రాత్రి 7 గంటల స‌మ‌యంలో చేసేయ‌లి. ఎందుకంటే రాత్రి భోజనం తర్వాత నుంచి నిద్ర వరకు మూడు గంటల వ్యవధి ఉండాలి. అలాకుండా రాత్రి 10 తర్వాతకు డిన్నర్ ను వాయిదా వేస్తే.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల డిన్నర్ కు, నిద్రకు మధ్య సమయం తక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత నిద్రిస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. మ‌రియు తిన్న వెంట‌నే నిద్రిస్తే.. బ‌రువు పెరిగే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: