ప‌ల్లీలు లేదా వేరుశెనగపప్పు.. ఇవి ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటాయి. ప్ర‌తి రోజు ప‌ల్లీల‌ను ఎదో రకంగా వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే  పేదవాడి జీడిపప్పుగా అభివర్ణించే వేరుశనగ పప్పుల్లో పౌష్టికాహార గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశెనగలోని అన్ శాచురేటెడ్ ఫ్యాట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది.

IHG

ఒక పిడికిలి వేరుశెనగ పప్పు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పాలు, కోడిగుడ్డు తిన్నాకూడా రాదు. ఎందుకంటే.. పాలలోని ప్రొటీన్లు నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ వేరుశెనగపప్పులోఉన్నాయి. అలాగూ వేరుశనగలో ఉన్న క్యాల్షియం ఎముకలు కండరాలను గట్టి పరుస్తుంది. వారంలో కనీసం మూడు సార్లు వేరుశనగను ఆహారంలో తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు రావని వైద్య నిపుణులు అంటున్నారు. ప‌ల్లీలు తిన‌డం వ‌ల్ల శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. 

IHG

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులను బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా, పల్లీల్లోని ప్రత్యేక పోషకాలు శరీరంలోని చెడు కొవ్వుని తగ్గించి.. మంచి కొవ్వుని పెంచుతాయి దీని వల్ల బరువు తగ్గాలనేకునేవారికి మేలు జరుగుతుంది. అందుకే పల్లీలు రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశనగలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. మ‌రియు జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. అలాగే ప్ర‌తి రోజు పల్లీలు తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: