కేంద్ర పాలిత ప్రాంత‌మైన చంఢీగ‌డ్ ఇత‌ర రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తోంది. ఇక్క‌డ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప  ‌డుతుండ‌ట‌మే కాకుండా రిక‌వ‌రీల సంఖ్య పెర‌గ‌డం ఆశాజ‌నక‌మైన విష‌యంగా చెప్పాలి.దేశంలో కరోనా వైరస్ రీకవరీ రేటు సుమారు 60 శాతానికి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ నుంచి గత ఇరవై నాలుగు గంటల్లో 1,19,696 మంది రోగులు కోలుకున్నారు. యాక్టివ్ కేసులను ఇవి మించిపోయాయి. మొత్తం రెండు లక్షల పదిహేను వేలకు పైగా యాక్టివ్ కేసులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి అని ఈ శాఖ పేర్కొంది. 

 

ఖఛ్చితంగా రికవరీ రేటు 59.07 ఉందని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.   అటు… దేశంలో కరోనా వైరస్ కేసులు 5,66,840 కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 418 మంది రోగులు మరణించారు.ఇదిలావుంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో క‌రోనా రిక‌వ‌రీ రేటు ఆధారంగా టాప్‌-15 రాష్ట్రాల‌తో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో 82.3 శాతం రిక‌వ‌రీ రేటుతో కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన‌ చంఢీగ‌డ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 69.1 శాతం రిక‌వ‌రీ రేటుతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 15వ స్థానంలో ఉన్న‌ది. ఇక‌ 80.8 శాతం రిక‌వ‌రీ రేటుతో మేఘాల‌యా రెండో స్థానంలో నిలువ‌గా.. 79.6 శాతం రిక‌వ‌రీ రేటుతో రాజ‌స్థాన్ మూడో స్థానంలో నిలిచింది. 

 

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి  త‌న ప్ర‌తాపం చూపుతూనే ఉన్న‌ది. ప్ర‌తిరోజు దాదాపు 20 వేల కొత్త కేసులు న‌మోద‌వు తున్నాయి. అయితే అదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య కూడా అంత‌కంటే ఎక్కువ‌గానే పెరుగుతున్న‌ది.  దేశంలో రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతూ వ‌స్తున్న‌ది. తాజాగా బుధ‌వారం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6 ల‌క్ష‌ల 80వేల పైచిలుకు కేసులు న‌మోద‌య్యాయి. అయితే త్వ‌ర‌లోనే రిక‌వ‌రీల సంఖ్య కూడా మ‌రింత రెట్టింప‌వుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: