ఎలాంటి అనారోగ్య సమస్యకైనా చక్కని  దివ్య ఔషధం నీళ్లు.శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. శరీరంలో బ్లడ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో.. నీటికి అదే స్థాయిలో విలువ ఉంది. మనిషికి రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు అవసరమౌతాయి. మనిషి బరువుని బట్టి కూడా తాగే నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది.అలాగే కొంతమందికి అసలు నీళ్లు ఎలా తాగాలి?  ఎప్పుడు తాగాలి?  ఎంత పరిమాణం లో తాగాలి అన్నా విషయాలు తెలియవు.


 అందుకనే నీళ్లు ఎప్పుడు తాగాలి ఎలా తాగాలో చూద్దాం.. మనం ఎప్పుడయినా గాని భోజనం చేసిన ఒకటిన్నర గంట  తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం జఠరస్ధానంలో గంటన్నర వరకు అలాగే వేడిగా మండుతూ ఉంటుందట. మనం వెంటనే నీరు త్రాగితే జఠరాగ్ని అనేది  చల్లబడి తిన్న ఆహారము పూర్తిగా జీర్ణము కాక మలబద్దకం,  గ్యాస్ సమస్యలు వస్తాయి.అందుకనే భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే , కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు.


భోజనం అయిపోయాక మళ్ళీ ఒక గుక్క నీళ్లు తాగాలి అంతే. భోజనం అయిపోయాక  నోటిని మంచిది  నీళ్లతో పుక్కిలించాలి. అలాగే మనం భోజనంతో పాటు  పండ్లరసాలు , మజ్జిగ , పాలు తీసుకోవచ్చు. కానీ వాటిని కూడా ఒక లెక్క ప్రకారం తీసుకోవాలి. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను  ఉదయం బోజనము చేసిన తర్వాత  తీసుకోవాలి అలాగే మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరము , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ఎట్టి పరిస్థితులలో మార్చకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను జీర్ణం చేసే ఎంజైములు మన శరీరంలో ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం   నీటిని  నిలబడి త్రాగకూడదు.


అలాగే రిఫ్రిజరేటర్ పెట్టిన నీళ్ళు చాలా హానికరం.గట గటా నీరుత్రాగే విధానం  మంచిది కాదు. నిదానంగా తాగాలి నీళ్లు ఎప్పుడు. నెమ్మదిగా కూర్చుని  ఒక్కొక్క చుక్క నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు ఎలా తాగుతామో అలా తాగాలి. ఎందుకంటే  మన నోటిలో లాలజలం తయారవుతుంది. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లాలు  తయారవుతాయి. మనం నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగితే నోటిలోని  లాలజలం నీటితో  కలసి పొట్టలోకి చేరుతుంది.


పొట్టలోని ఆమ్లాలతో లాలాజలం  కలసి న్యూ ట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలజలం తయారయ్యేది పొట్టలోనికి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికే.అలా కాకుండా హడావుడిగా తాగేస్తే నీటితో పాటు లాలాజలం లోపలికి పోదు. దానివల్ల ఆమ్లాలు స్థాయి మరింత పెరిగి అసిడిటీ, జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి..

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: