జూలై, ఆగ‌స్టు మాసాల్లో క‌రోనా విల‌యం తాండ‌వం చేయ‌నుంద‌ని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇదే విష‌యాన్ని అటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రియు ప‌లు ఆరోగ్య స‌ర్వేలు కూడా ధ్రువీక‌రిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మరో సారి విలయతాండవం చేయనుందా..? తగ్గుముఖం పడుతున్నట్టే పట్టి మళ్లీ మానవాళి మీద విరుచుకు పడనుందా.. రాబోవు రెండు నెలల్లె జరగబోతోంది అదేనా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. సహజంగా చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వర్షాకాలంలో తన ప్రతాపాన్ని చూపబోతుందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు నిర్థారిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 20వేల‌కు పైగా కేసులు కేసులు బయటపడుతున్నాయి. 

 

దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్యులు  స్పందిస్తూ భయంకరమైన వాస్తవాలను విశ్లేషిస్తున్నారు. ఇపుడు చూస్తున్న కరోనా వైరస్ తీవ్రత తారా స్థాయి కాదని,  జూలై, ఆగ‌స్టు మాసాల్లో కరోనా వైరస్ తీవ్రత తారాస్థాయిలో ఉండబోతోందని స్పష్టం చేస్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి కట్టడికి మరింత ముందుజాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నైలాంటి మ‌హాన‌గ‌రాల్లో క‌రోనా వైర‌స్ సామూహిక వ్యాప్తికి చేరుకున్న‌ట్లు అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ న‌గ‌రాల్లో కుప్ప‌లు తెప్ప‌లుగా కేసుల న‌మోదు జ‌రుగుతోంది. 

 

 ఎక్కడ బౌతిక దూరం.. భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తే నెలరోజుల్లో కరోనా అదుపులోకి రావాల్సిన వైరస్ ఎక్కడా జనం అది కఠినంగా పాటించనందున వైరస్ ఉదృతి తగ్గడం లేదని విశ్లేషిస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే లాక్‌డౌన్ అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోంది. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న ద‌రిమిలా మ‌ళ్లీ అమ‌ల్లోకి తేవాల‌ని ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది. కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాలను నాశనం చేయడంతో పాటు, దేశ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బ కొడుతోంది. దీంతో అనేక దేశాలు ఆర్ధిక సమస్యలను అధికమించేందుకు విపరీతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ అమ‌ల్లోకి తీసుకురావ‌డం వ‌ల‌ను నిరుపేద‌లకు ఉపాధి క‌రువై పూట గ‌డ‌వ‌టం కూడా క‌ష్టంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: