కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబులు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హైకోర్టు చేసిన సూచనను పరిశీలించామనీ, ఆర్టీ పీసీఆర్‌ టెస్టింగ్‌ యూనిట్‌ను మొబైల్‌ వాహనంలో తీసుకువెళ్లడం వల్ల బ‌యో సేఫ్టీ ఉండ‌ద‌ని తెలిపింది.మొబైల్‌‌ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు సూచన ఆచరణలో వీలుకాదని, ఆర్టీ–పీసీఆర్‌‌ టెస్టింగ్‌‌ యూనిట్‌‌ను మొబైల్‌‌ వాహనంలో తీసుకువెళ్లడం కష్టమని వివరించింది.కరోనాకు సంబంధించి దాఖలైన 9 ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్​ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు నివేదిక అందచేశారు.

 

అలాగే  కరోనా పరీక్షలు చేయడం లేదనీ, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని దాఖలైన పలు పిల్స్‌లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ డైరెక్టర్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.  జిల్లాల్లో 52, జీహెచ్‌ఎంసీలో 9 చొప్పున ఆస్పత్రులు ఉన్నాయి. థర్మల్‌ స్క్రీనింగ్‌ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు 2157 పంపాం. మరో 8 వేలకు ఆర్డర్‌ ఇచ్చాం. త్వరలోనే అవి కూడా వ‌స్తాయ‌ని తెలిపింది. వస్తాయి. సౌక‌ర్యాల‌ను​ పెంచాం  కరోనా కట్టడి కోసం గాంధీ ఆస్పత్రిలో బెడ్స్​ సంఖ్యను రెట్టింపు చేశామని, గతంలో 1,002 బెడ్స్‌‌ ఉంటే ఇప్పుడు 2,100 బెడ్స్​కు పెంచామని, వెయ్యి బెడ్స్​కు మాత్రమే ఆక్సిజన్​ సదుపాయం ఉంటే.. మరో 700 బెడ్స్‌‌కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

 

వారం రోజుల్లోగా ర్యాపిడ్‌ యాంజిటెన్‌ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. జూన్‌ 20 నుంచి జూన్‌ 29వ తేదీ వరకూ 40,837 టెస్ట్‌లు చేశాం. అదే తేదీ నాటికి మొత్తంగా 84,134కు చేరాయి. 69712 మందికి నెగిటివ్‌, 15,394 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు 9559 (జీహెచ్‌ఎంసీ పరిధిలో 5644), డిచార్జి 5582 మంది అయ్యారు.  పది రోజుల్లో 40,837 టెస్టులు గత నెల 20 నుంచి 29 వరకూ పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,837 టెస్టులు చేశామని, జూన్‌‌ 29 నాటికి మొత్తంగా 85,106 టెస్ట్‌‌లు చేశామని ఆ రిపోర్ట్​లో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: