ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. ఇంకా 80 శాతం కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నారు. ఇంతకముందు అయితే కనీసం గంట లేదా రెండు గంటలు అయినా ప్రయాణం కారణం వ్యాయామంలా ఉండేది. 

 

కానీ ఇప్పుడు అలా కాదు కదా! ప్రతి ఒక్కరు ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు సిస్టం ముందు కూర్చొని పని చెయ్యడమే. తినడం అక్కడే.. పని చెయ్యడం అక్కడే. ఇంకా దీని వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. 

 

మెలుకువగా ఉన్న సమయంలో 90 శాతం కూర్చోవడమే సరిపోతుంది. దీని వల్ల ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. అందుకే దీని వల్ల ఊబకాయం, దీర్ఘకాలంలో గుండెజబ్బులు, క్యాన్సర్‌, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎంతోమందికి వస్తున్నాయి. అటు ఇటు తిరగకుండా కూర్చోవడం వల్ల ఎన్నో నష్టాలు వస్తాయిని, కాబట్టి ప్రతి గంటకు ఒకసారైనా అటు ఇటు తిరగాలని సూచిస్తున్నారు. 

 

కదలకుండా కూర్చొనేవారి రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతుందని దీని వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే.. ఎక్కువ సమయం కూర్చొనే వారి కండరాలు తగిన కదలికలు లేక బిగుసుకుపోతాయి. అందుకే మీ జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి.. ప్రతి అరగంటకోసారి కుర్చీ నుంచి లేచి అటూఇటూ తిరగాలి.

 

ఇంకా రోజుకి కనీసం 40 నిమిషాల పాటు నడక లేదా జాగింగ్ చెయ్యాలి.. దీనివల్ల కీళ్ల సమస్య రాకుండా చేస్తుంది. కూర్చున్నవారు చేతులు పై లేపటం, అటూ ఇటూ తిప్పటం వల్ల భుజాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. ఫోన్‌ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే అటు ఇటు తిరుగుతూ మాట్లాడితే మంచిది. ఈ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని జగ్రత్తగా కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: