ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌లాది మంది క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే  పండ్లు ఎక్కువగా తినమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క‌రోనా టైమ్‌లో బొప్పాయి తింటే మ‌రింత మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి.

IHG

ఎందుకంటే.. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. బొప్పాయి విష‌యానికి వ‌స్తే.. ఈ పండు గురించి తెలియ‌ని వారుండ‌రు. చాలా మంది బొప్పాయి పండును ఇష్టంగా తింటారు. కొంద‌రు మాత్రం ఈ పండును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కాని, బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్ , న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి.

IHG

ముఖ్యంగా బొప్పాయి పండులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతాయి. అంతేకాకుండా.. ఇన్ఫెక్షన్స్ వృద్ధిని అరికట్టేందుకు కూడా స‌హాయ‌ప‌డ‌తాయి. అందుకే బొప్పాయిని తరచూ తీసుకోవడం వలన జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియా అలాగే వైరస్ ల నుంచి రక్షణ పొందవచ్చు.

IHG

అదేవిధంగా.. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి.. దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి యూజ్ అవుతుంది. కాబ‌ట్టి, ప్ర‌తి ఒక్క‌రూ బొప్పాయిని త‌న డైలీ డైట్‌లో చేర్చుకోవ‌డం మంచిద‌ని అంటున్నారు.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: