జ్వ‌రం.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవితంలో ఫేస్ చేసిన స‌మ‌స్యే ఇది. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్‌ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అదే జ్వ‌రం. ముఖ్యంగా ఈ సీజన్ లో వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైలర్ ఇన్ ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ జ్వ‌రాన్ని వెంట‌నే త‌గ్గించుకోవాలంటే డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే.. మంచి ఫ‌లితం ఉంటుంది.

 

అందులో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.. వేడి నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి జ్వరం తగ్గించడానికి సహాయపడుతుంది. గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. దీంతో శ‌రీర ఉష్ణోగ్ర‌త కొద్దిగా పెరిగినా, స్నానం వ‌ల్ల క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త త‌గ్గుతూ వ‌చ్చి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. దీంతో జ్వ‌రం త‌గ్గుతుంది.

 

అలాగే తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జ్వరంను తక్షణం తగ్గిస్తుంది. కాబ‌ట్టి, ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేని మిక్స్ తాగితే.. మంచి ఫ‌లితం ఉంటుంది. అదేవిధంగా, జ్వ‌రం వ‌చ్చిన వారు ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నారింజ‌, ద్రాక్ష‌, కివీ వంటి పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. ఇది తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శక్తి పెరిగి.. జ్వ‌రం త‌గ్గుముఖం ప‌డుతుంది. మ‌రియు ఒక గ్లాస్ గోరువెచ్చిన నీటిలో ప‌సుపు క‌లిపి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పసుపులో ఉండే కుర్కిమిన్ కాంపౌండ్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేసి.. జ్వరంతో పోరాడుతాయి. త‌ద్వారా జ్వ‌రం త‌గ్గుముఖం ప‌డుతుంది.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: