ప్రపంచంలో ఎవరికైనా కంటినిండా ఎంతో అవసరం. నిద్ర లేమి వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వైద్యనిపుణులు అంటున్నారు. నిద్రను అతిగా ప్రేమించినా, అతిగా దూరం చేసుకున్నా రెండూ చివరికి చేటే. సరైన ఆరోగ్యం లేనప్పుడే నిద్ర సమస్యలు వస్తాయి. సరైన రీతిలో నిద్రపట్టదు. ఇదే సమయంలో సరైన నిద్రలేకపోతే విపరీతస్థాయిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్రతోనే ప్రపంచంలోని పోటీ తత్వాన్ని తట్టుకునే రీతిలో ఆధునిక మానవుడు ముందుకు పయనించ గలుగుతాడు. నిద్రమత్తు మనిషిని చిత్తు చేస్తుంది. అతి నిద్ర వద్దు కానీ నిద్ర భద్రం సుమీ అనే పిలుపుతోనే ప్రపంచం అంతటా ఈ నిద్రోత్సవం జరుగుతోంది. పల్లె,పట్టణం అన్న తేడా లేదు.మారిన జీవన శైలి,రాత్రీ,పగలూ అన్న తేడాలేని ఉద్యోగాలు,పోటీ యుగం లో పిల్లల 24 గంటల చదువులు, టీవీలు,సోషల్ మీడియా,ఇంకా అనేకానేక కారణాలతో సరైన వేళకి,సరైన నిద్ర కరవు అయిపోయింది.

 


నిద్ర లేమి వల్ల అనేక శారీరక,మానసిక సమస్యలు.ఒత్తిడి,నిద్ర లేమి,తలనొప్పి ఇలా ఒక దానికొకటి పెనవేసుకొన్న సమస్యలు.ఈ మధ్య ఇటువంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.ఐతే ఈ సమస్యలు మరీ తీవ్రం గా ఉంటేనే వైద్యులని సంప్రదిస్తున్నారని,అంతే కాకుండా అపసవ్య నిద్ర వల్ల ఈ సమస్యలు వస్తున్నాయన్న స్ప్రహ అందరికీ ఉండటం లేదని నిపుణులు చెప్తున్నారు.

 


మంచి నిద్ర లేకపోవటం,పడుకున్న కాసేపటికే మెలకువ రావటం,కలత నిద్ర,తల భారం గా ఉండటం,అపసవ్య శ్వాస,గురక,నోరు పిడచ కట్టుకొని పోయినట్లుండి నిద్ర మెలకువ రావటం వంటివి కూడా నిద్రలేమి కి సంబంధించిన సమస్యలే నన్నది నిపుణుల వివరణ.  అయితే మానవ ఆరోగ్యానికి సరిపడ నిద్ర కచ్చితం గా అవసరమేనని నిపుణులు స్పష్టం చెస్తున్నారు.దానికి అవసరమైన కింద 
 
1. రాత్రి భోజనం త్వరగానే పూర్తి చేయాలి.తిన్న వెంటనే కాకుండా కనీసం రెండు గంటల గాప్ ఇచ్చి పడుకోవాలి.రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు గా చేసుకోవాలి.


2. కాఫీ తాగితే ఉండే అనుభూతి బాగానే ఉంటుంది..కానీ తక్కువ సార్లు తాగితే నిద్ర చక్కగా పడుతుంది.


3.సాయంత్రాలు మొబైల్ ఫోనులు,కంప్యూటర్లు,లాప్ టాప్ ల వాడకం తగ్గించాలి.


4. గోరు వెచ్చని పాలు, మితంగా పళ్ళు తినటం..


5.క్రమం తప్పకుండా వ్యాయామం,సానుకూల అలోచనలు,ప్రక్రతి ఆస్వాదన,మంచి సంగీతం వినటం కూడా తప్పనిసరి

మరింత సమాచారం తెలుసుకోండి: