సోయాపాలు..వీటి లాభాలు ఎన్నో మీకు తెలుసా? సోయాపాలు కేవలం మేలైన ఆహారమే కాదు అనారోగ్య సమస్యలకు ఇది చక్కని ఔషధం అని అంటున్నారు వైద్య నిపుణులు. పాలు, పాల పదార్థాలు పడనివారికి సోయా పాలు ఎంతో మంచిది. ఈ సోయాపాలలో చక్కర, క్యాలరీల అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి. 

 

IHG

 

ఈ సొయా పలు వెన్న తీసిన పాలతో సమానం. అందుకే బరువు తగ్గాలని అనుకునే వారికీ వీటితో ఎన్నో లాభాలు ఉంటాయి. సొయా పాల వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ సొయా పాలు ఇతర పాలు, ఇతర పప్పు ధాన్యాల కంటే ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.

 

IHG

 

ఈ సోయా పాలల్లో విరివిగా ఉండే ఫ్యాటీ ఆమ్లాలూ, పీచు, విటమిన్లు, ఖనిజలవణాలు శరీరానికి తగిన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఈ సోయాపాలలోని ఒమెగా 3, 6 ఫ్యాటీ ఆమ్లాలు, శక్తివంతమైన ఫైటో - యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇంకా వీటి వల్ల ప్రాణాంతక వ్యాధులబారి నుంచి రక్షణ లభిస్తుంది.

 

IHG

 

సోయాపాలలోని పీచు ఆకలిని పూర్తిగా తగ్గిస్తుంది.. దీని వలన అధిక బరువు సమస్య రాదు. అంతేకాదు ఈ సోయాపాలలో లభించే ఫైటోఈస్ట్రోజెన్‌ హార్మోను లోపాన్ని సవరించి పై సమస్యలు రాకుండా చేస్తాయ్. నరాల బలహీనత, నిస్సత్తువ, మానసిక ఒత్తిళ్ల బాధితులు సోయా పాలు వాడితే ఉపశమనం లభిస్తుంది. ఇంకా గుడ్లు, చేపలు తిననివారు సోయాపాలు తీసుకుంటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా బలంగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: