యాంటీ వైరల్ డ్రగ్.. రెమ్ డెసివిర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ మెడిసిన్ ‘టోసిలిజుమాచ్’ వంటి మందుల‌ను కొనుగోలు చేయాలంటే‘ఆధార్’ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో  డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వివరాలు, తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అంగీకార పత్రాలు, కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టు, రోగులు సమర్పించవలసి ఉంటుంది. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ తదితరాలన్నింటీని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేతిరాత‌తో రాసినా..లేదా ప్రింట‌వుట్ జిరాక్స్ కాపీల‌ను మెడిక‌ల్ దుకాణాల్లో  అందించి మందుల‌ను పొందాల్సి ఉంటుంద‌ని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది

 

యాంటీ వైరల్ డ్రగ్.. రెమ్ డెసివిర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ మెడిసిన్ ‘టోసిలిజుమాచ్’ వంటి డ్రంగ్స్ బ్లాక్ మార్కెట్ త‌ర‌లుతున్న‌ట్లు ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అంద‌డంతో ఈ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు ముఖ్యమైన ఔషధంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ధర ఢిల్లీ, ముంబై లాంటి న‌గ‌రాల్లో రూ.35వేల‌కు పైగా అమ్ముతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.   కరోనా వైరస్ కు ఆశాజనకంగా భావిస్తోన్న రెమిడెసివిర్  ధర చుక్కలనంటుతోంది. యాంటీ వైరల్ డ్రగ్గా  ప్రాచుర్యంలో ఉన్న ఈ మందును కోవిడ్ 19 చికిత్సలో ప్రస్తుత పరిస్థితిలో అధికంగా వినియోగిస్తున్నారు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈమేర‌కు కొన్ని ఫిర్యాదులు అంద‌డంతోనే క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించింది. 

 

ఇదిలా ఉండ‌గా రెమ్ డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను డిమాండ్‌కు అనుకూలంగా  సిద్ధం చేస్తున్నామని హెటెరో హెల్త్‌కేర్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే. 100 మిల్లీ గ్రాముల ఇంజెక్షన్‌ను రూ.5,400కు అందిస్తున్నామని పేర్కొంది. గ‌తంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా  ఆమోదం తరువాత  హెటెరో తొలి విడతలో 20 వేల ఇంజెక్షన్ల ను  పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 20వేల ఇంజెక్షన్ల ను 10వేల శాంపిల్స్ చొప్పున ముంబై,ఢిల్లీ పంపిణీ చేస్తున్న‌ట్లు పేర్కొంది. ముందుగా గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్ తో పాటు  కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవా వారాల్లోపు సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: