అరటి పండ్లు.. ఇవి తెలియ‌ని వారు, రుచి చూడ‌ని వారు ఉండ‌మో. ఎంతో రుచిగా ఉండే అర‌టి పండ్లు ఏ సీజ‌న్‌లో అయినా త‌క్కువ ధ‌ర‌కే విరివిరిగా ల‌భిస్తాయి. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్-బి పుష్క‌లంగా ఉండ‌డం వల్ల ఆరోగ్యవంతమైన ఆహారాలలో ఒకటిగా నిలిచింది. అర‌టిపండులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తహీనత‌తో బాధ‌ప‌డేవారికి అర‌టిపండు బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు.

IHG

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అర‌టి పండుతో టీ కూడా త‌యారు చేస్తారు. ఈ టీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నిద్రలేమి అంత్యంత ప్రమాదరమైనది. నిద్రలేమి మన దినచర్యపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ నిద్ర‌లేమి కార‌ణంగా చాలామంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

IHG

అయితే అర‌టి పండు టీతో ఈ భ‌యంక‌ర నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అర‌టిపండు ముక్క‌ల‌ను నీటిలో బాగా మ‌రిగించి.. వాడ‌క‌ట్టుకోవాలి. ఆ నీటిని తాగుతారు. ఇందులో షుగర్ కలపాల్సిన పనిలేదు. అరటిలోని స్వీట్ కాస్తంత నీటిలో కలుస్తుంది కాబట్టి నేచురల్ స్వీట్ లభిస్తుంది. ఈ టీ రోజుకు ఒక క‌ప్పుడు తాగితే నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు. అలాగే  ప్రతిరోజూ ఓ అర‌టిపండు తీసుకోవడం వ‌ల్ల‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తద్వారా మీరు జలుబు, దగ్గు, బ్యాక్టీరియా సంక్రమణ మరియు ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. మ‌రియు అధిక ర‌క్త‌పోటును కూడా అర‌టి పండు టీ నివారిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: