నిరంతరాయంగా పనిచేయడం వల్ల అధిక ఒత్తిడికి గురయ్యేవి కళ్లు. ఎక్కువ సమయం డ్రైవింగ్ చేయడం, చదవడం, కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల కళ్లు ఎక్కువగా అలిసిపోతుంటాయి.   దీంతో ప్రతి ఒక్కరూ కళ్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. కంటి సమస్యలు భయపెడుతున్నాయి.  2018 లో బీఎంజే ఓపెన్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల వినియోగం వల్ల కళ్లపై ఒత్తిడి 50% కంటే ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

 

దీన్నే కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోం అంటారు. కళ్లు మండడం, చికాకు, అస్పష్టత, పొడిబారడంలాంటివి దీని బాహ్య లక్షణాలు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి అంతర్గత లక్షణాలు . మన కళ్లు అలసి పోయినపుడు   కొద్దిసేపు బయట తిరిగిరావడం, చల్లని నీటితో కళ్లను కడుక్కోవడంలాంటివి చేయాలి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటే దృష్టిలోపం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటపుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. 

 

కళ్లపై వత్తి ఉన్నపుడు ఏం చేయాలి..

 

- క్రమం తప్పకుండా కనురెప్ప లను వాలుస్తూ ఉండాలి. కనురె ప్పలను వాల్చినపుడు కన్నీరు విడుదలవుతుంది. దీనివల్ల కూడా కళ్లు తాజాగా ఉంటాయి.

 

- మీరు టీవీ చూస్తున్నా.. మీ కంప్యూటర్‌పై పనిచేస్తున్నా లేదా మీ మొబైల్ ఫోన్‌ చూస్తున్నాఅందులో మొదట బ్రైట్‌నెస్‌ తగ్గించండి

 

- పనిచేసేటపుడు మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతినివ్వాలి. కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేటపుడు కనీసం 20 నిముషాలకు ఒకసారైనా దృష్టిని మరల్చాలి. 20 ఫీట్లలో ఉన్న దూరాన్ని కనీసం 20 నిముషాల పాటైనా చూడాలి.

 

- నేత్ర వైద్యుడిని సంప్రదించి, అతినీలలోహిత కిరణాలు, అదనపు కాంతి మొదలైన వాటి నుండి మీ కళ్లను రక్షించగల అద్దాలను తీసుకోండి. సరైన అద్దాలు పొందడం వల్ల మీ కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యామ్నాయంగా, మీరు మీ పరికరాల కోసం యాంటీ గ్లేర్ స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా పొందవచ్చు

 

- నేత్ర వైద్యుడిని తరచూ సంప్రదిస్తూ ఉండాలి. వారు ఇచ్చే కంటి చుక్కలను వాడాలి.  తగినంత నీరు తాగుతూ, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దోసకాయముక్కలను చక్రాలుగా కోసం కళ్లపై ఉంచితే కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: