ప్రస్తుత రోజుల్లో మానవ జీవితం గతంలో మాదిరిగా లేదు. వైరస్ ప్రభావం తో మనిషి చాలా వరకు ఇంటికి పరిమితం కావడంతో అడుగుతీసి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఉండటం వలన మనిషి బాగా బద్ధకానికి అలవాటు పడిపోయాడు. తినటం వెంటనే వయసుతో నిమిత్తం లేకుండా మనిషి మంచం మీద పడుకోడానికి అలవాటు పడి పోవటం తో చాలా మందిలో ఇప్పుడు పొట్ట పేరుకుపోయింది. ఈ సమస్య గురించి చాలామంది ఇంటర్నెట్లో ఎలా తగ్గించుకోవాలి అన్న దాని విషయంలో చాలా వెతుకుతున్నారని ఇటీవల ఇంటర్నెట్ లెక్కల్లో బయటపడింది. ముఖ్యంగా భారతీయులకు పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పెరిగి పోయేలాగా పెరిగే ఉండటం జరుగుతోంది.

 

దీనినే  'సెంట్రల్ ఒబేసిటీ' అని చాలామంది పిలుస్తారు. ప్రపంచంలో అన్ని దేశాల వల్ల ఈ విధంగా ఎక్కువగా బాధ పడేది భారతీయులే అని తాజా పరిశోధనలో తేలింది. ఇదిలా ఉండగా ఈ సమస్య వల్ల బాధపడేవారిలో మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని పొట్ట తో పాటు మెదడులో కూడా మెమరీ తగ్గిపోతోందనీ లండన్ పరిశోధకులు ఇటీవల పరిశోధనలో తేల్చారు. అంతేకాకుండా మెదడులో డెమెంటీయా (మతిమరుపు తరహా) వ్యాధికి దారి తీస్తుందని కనుగొన్నారు. ఎక్కువ కూర్చుని వర్క్ చేసే వారిలో మరియు బయట మద్యం అదేవిధంగా రెస్టారెంట్ ఫుడ్ తీసుకునే వారికి ఈ 'సెంట్రల్ ఒబేసిటీ' వస్తుందని పరిశోధనలో తేలింది. 

 

ఈ విధంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం కోసం మూడు సూత్రాలు:-

 

మొదటిది: ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నిద్ర పోక ముందు ఇసబ్గోల్ ఫైబర్ సోంపు ఉసిరి కలిసిన మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని తీసుకుంటే జీర్ణకోశం శుభ్రంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది తర్వాత మలబద్ధకం లేకుండా ఉంటుంది దీంతో చాలా కొత్త తేలికగా ఉంటుంది. 

 

రెండవది: బయట మద్యం మరియు చిరుతిళ్ళు తినడం తగ్గించి స్వీట్స్ ప్రతిరోజు తినే అలవాటు ఉన్నవారు మానుకుంటే మంచిది. నెలకి ఒకసారి మాత్రమే అది కూడా బెల్లం కలిపిన స్వీట్ లు తీసుకుంటే బాగుంటుంది. 

 

మూడవది: రాత్రి భోజనానికి బదులు ఏదైనా ఫ్రూట్స్ లేకపోతే తాజా కొబ్బరి సలాడ్ తీసుకుంటే బెటర్. చాలా వరకు రాత్రి భోజనం చేయకుండా ఉంటే బెటర్ అని అలాగని పొట్ట మాడ్చుకోకుండా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

ఈ సూత్రాలు పాటిస్తే చాలా వరకు పొట్ట తగ్గుతుందని, లేకపోతే పొట్ట తో పాటు మెదడు సమస్యలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: