కొబ్బ‌రి.. అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదు. ఎందుకంటే.. ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రిని అంద‌రూ తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. కొబ్బ‌రిని అనేక ర‌కాల వంట‌ల్లో ఉప‌యోగిస్తారు. ఇక కొబ్బ‌రిని ఏ వంట‌ల్లో ఉప‌యోగించినా.. ఆ రుచే వేరు అన‌డంలో సందేహం లేదు. అయితే కొబ్బ‌రి తినే ముందు.. దీనిలో ఉన్న పోష‌కాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కొబ్బ‌రి ఆరోగ్యానికి మంచిది అన్న‌ది విష‌యం అందరికి తెలుసు. కాని, ఏ విధంగా మంచిది అన్న దానిపై మాత్రం చాలా మంది దృష్టి పెట్ట‌రు.

 

వాస్త‌వానికి కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉంటాయి. కొబ్బ‌రిలో కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం, జింక్, విట‌మిన్ బి1, బి5, బి9 త‌దిత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల కొబ్బ‌రి మన డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఇవి మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. అలాగే  కొబ్బరిలో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా..  పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కొబ్బ‌రి బెస్ట్ ఫుడ్‌గా చెప్పుకోవ‌చ్చు.  ఆడవారికి థైరాయిడ్ సమస్యలు రాకుండా చేయ‌డంతో కొబ్బ‌రి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

 

అదేవిధంగా, కొబ్బ‌రి మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ని వృద్ధి చేస్తాయి. కాబట్టి లైంగిక సమస్యలతో బాధపడేవారు కొబ్బరిని తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు. ఇక కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. కొబ్బ‌రి తిన‌డం వ‌ల్ల మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌రియు ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా కొబ్బ‌రి తింటే మంచి ఫ‌లితం ఉంటుంది. సో.. కొబ్బ‌రిని త‌క్కువంచ‌నా వేయకుండా ఖ‌చ్చితంగా మీ డైలీ డైట్‌లో చేర్చుకోమ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: