బంగాళదుంప.. ఇవి తెలియ‌ని వారు, రుచి చూడ‌నివారు చాలా అరుద‌నే చెప్పాలి. ఈ బంగాళదుంపను కొన్ని చోట్ల ఆలు గడ్డ  అని ఉర్ల గడ్డ అని కూడా పిలుస్తుంటారు. బంగాళ‌దుంప‌తో ఏ వంట చేసినా..  పిల్లల నుండి పెద్దలదాకా నోట్లో లొట్టలు వేసుకుంటూ తింటారు. ఏ కాలంలో అయినా విరివిరిగా దొరికే బంగాళ‌దుంప‌లు తినే ముందు ఖ‌చ్చితంగా అది మ‌న ఆరోగ్యానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసుకోవాలి. బంగాళ‌దుంప‌లో విటమిన్లు, మినరల్స్ ఇంకా పీచు పదార్ధాలతో పాటు కారోటేనైడ్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.

IHG

ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్‌ సీ, బీ కాంప్లెక్స్‌, ఖనిజలవణాలు బంగాళ‌దుంప‌లో ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలు రాకుండానూ నివారిస్తుంది. అలాగే నోటి అల్సర్ ఉన్న వాళ్ళకు  బంగాళదుంప మంచి ఆహారంగా చెప్పుకోవ‌చ్చే. మ‌రియు పచ్చి  బంగాళదుంప ముద్ద ని కాలిన గాయాలు కి రాస్తే కొంత ఉపశమనం కూడా కలుగుతుంది.

IHG

అదేవిధంగా, ప్ర‌తిరోజు ఒక క‌ప్పు బంగాళ‌దుంప జ్యూస్ తాగితే.. శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది. బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల మ‌రో ప్ర‌యోజనం ఏంటంటే.. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రోజంతా మానసింకగా ఉత్సహాంగా ఉండటానికిసహాయపడుతుంది. అలాగే బంగాళ‌దుంప‌లో ఉండే  , కాల్సియం మరియు మెగ్నీషియం కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం క‌లిగిస్తుంది. కాబ‌ట్టి, బంగాళ‌దుంప‌ను వారానికి క‌నీసం రెండు సార్లు అయినా తీసుకుంటే మంచిద‌ని అంటున్నారు.

 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: