మన శరీరంలో చెవి ముఖ్యమైన భాగం..ఎదుటి వారితో భావాలు పంచుకోవాలన్నా వారు ఏం చెప్పినా వినాలన్న మన చెవులు సరిగా పనిచేయాలి. ప్రపంచం సుందరమైనది అందులో..సంగీతం ఒకటి అలాంటి సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నా..ఎదుటి వారు చెప్పిన దానికి స్పందించాలన్నా చెవి ముఖ్యభాగంగా పనిచేస్తుంది. అయితే  చెవినొప్పి కొన్ని సందర్బాల్లో తట్టుకోలేని, భరించలేని విధంగా ఉంటుంది. చెవినొప్పి రెండు చెవులకు ఉండవచ్చు.

కానీ, చాలా వరకూ ఒక చెవి మాత్రమే ఎక్కువగా నొప్పి కలిగి ఉంటుంది. చెవినొప్పి ఏవిధంగా వచ్చినా.. ఎలాంటి నొప్పి అయినా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో సులభంగా తగ్గించుకోవచ్చు. చెవినొప్పి పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. చెవినొప్పికి ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండానే, హోం రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు.. మరి చెవి నొప్పిని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్‌షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు


వెల్లుల్లిలో అనాల్జిక్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చెవినొప్పిని నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, రసాన్ని చెవిలో రెండు మూడు చుక్కల వదలడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు వెల్లుల్లి రెబ్బలను ఆముదంలో వేసి, గోరువెచ్చగా చేసి రెండు మూడు చుక్కలను చెవిలో వేసుకోవాలి.  


చెవి నొప్పిని నివారించే ఒక పురాత హోం రెమెడీ ఇది . ఉల్లిపాయలో ఉండే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చెవి నొప్పి నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి, రెండు మూడు చుక్కలు చెవిలో వదలడం వల్ల చెవి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.  


పడుకున్నప్పుడు,కూర్చున్నప్పుడు,తలనిటారుగావుంచినప్పుడు, చెవినొప్పి వస్తే. చూయింగ్‌గమ్ నమలకూడదు.  



చల్లటినీరు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు.  స్నానం తర్వాత చెవిలో నీరు పడితే వెంటనే తుడుచుకోవాలి.


చెవిలో బాలతైలం (ఆయుర్వేదం) పోస్తే నొప్పి తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: