ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది.
కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి.

Image result for coconut water

 1 గుండెకు చాలా మంచిది
కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.

2. జీవక్రియను పెంచుతుంది
రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.

 3. కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు
తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు.
అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

 4. డీ హైడ్రేషన్ ఉండదు
కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి.
అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
 
 5. జీర్ణశక్తిని పెంచుతుంది
కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.
 
 6. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది
కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య అనేది ఉండదు.
 
7. ఎముకలను బలంగా ఉంచగలదు
కొబ్బరి నీటిలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మీ ఎముకల్ని బలంగా చేస్తాయి. అందువల్ల ఎముకలు బలపడాలంటే రెగ్యులర్ కొబ్బని నీళ్లు తాగడం మంచిది.
Image result for coconut water
 8. బరువు తగ్గొచ్చు
మీరు గంటల తరబడి వ్యాయామం చేయకుండానే ఈజీగా బరువు తగ్గించ గల శక్తి కొబ్బరి నీళ్లకు ఉంటుంది. కొబ్బరి నీరు మీలో కాస్త ఆకలి తగ్గిస్తుంది.
అంతేకాకుండా శరీరంలో ఫ్యాట్ ను కొబ్బరి నీళ్లు కరిగిస్తాయి.
 
 9. యాంటీ డయాబెటిక్
కొబ్బరి నీళ్లు యాంటీ డయాబెటిక్ గా పని చేస్తాయి. బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే డయోబెటిక్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకపోవడం కూడా మంచిది. హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ సమస్య బారిన పడే అవకాశం ఉంది.

 10. రక్తం గడ్డకట్టే సమస్య ఉండదు
రక్తం గడ్డకట్టే సమస్యను కొబ్బరి నీళ్లు పరిష్కరిస్తాయి. కొందరిలో ఈ సమస్య ఏర్పడుతుంటుంది. దీన్ని కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా పరిష్కరించుకోవొచ్చు.

11. రక్తపోటును తగ్గిస్తుంది
కొబ్బరి నీళ్లు రక్తపోటును తగ్గిస్తాయి. హైపర్టెన్సివ్ తో బాధపడే వారు రెగ్యులర్ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీంతో వారిలో ఆ సమస్య పోతుంది.

12.బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తొలగించగలవు
కొబ్బరి నీళ్లు రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తొలగించగలవు. ఈ విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది.

13. అతిసారం సమయంలో ఎక్కువగా తాగాలి
అతిసారంతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఓఆర్ ఎస్ కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచివి. అందువల్ల అతిసారం సమయంలో కొబ్బరి నీళ్లను తాగడం మంచిది.

14. వ్యర్థాలన్నీ బయటకు పోతాయి
శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకుపంపడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అప్పడప్పుడు కేవలం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.

15. తక్షణ శక్తిని ఇస్తుంది
మీకు తక్షణ శక్తిని ఇవ్వడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. మీరు బాగా అలసిపోయినప్పడు కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పొయిన శక్తిని తిరిగి పొందుతారు.
Image result for coconut water
16. హ్యాంగోవర్ తగ్గిపోతుంది
చాలామంది రాత్రి తాగింది దిగకపోవడంతో హ్యాంగోవర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. మద్యపానం వల్ల శరీరంలోని ఉన్న శక్తిని మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో మీరు కోకనట్ వాటర్ తాగడం చాలా మంచిది.
 

17. తలనొప్పి తగ్గిపోతుంది
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగి చూడండి

18. మతిమరుపు
మతిమరుపు సమస్యను కొంత మేరకు కొబ్బరి నీరు పరిష్కరించగలదు. కొబ్బరి నీళ్లలో ఉండే ట్రాన్స్-జేజిటిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించగలదు.

 19. కాఫీ, టీల కంటే చాలా మంచిది
కాఫీ లేదా టీని క్రమం తప్పకుండా తాగుతున్నట్లయితే వాటి బదులుగా కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. వాటికంటే బోలెడన్నీ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి.

20. హానికరమైన బాక్టీరియా నుంచి కాపాడుతుంది
కొబ్బరి నీళ్లలోని ఔషధ గుణాలు శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడగలవు. ఈ కోలి, పి ఎరుగినోస, బీ సబ్ టిల్స్ , ఆరియస్ వంటి బ్యాక్టీరియాపై కొబ్బరి నీళ్లు ప్రభావంతంగా పని చేస్తాయి. కొబ్బరి నీరు యాంటీమోక్రోబియాల్ గా పని చేస్తుంది.

21. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొబ్బరి నీటిలో ఆమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తగ్గిచండానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

 22. మంచి నిద్ర
రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు. అలాగే మంచి నిద్ర వస్తుంది. కొబ్బరి నీటిలో గాబా ఉంటుంది. ఇది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది కండరాలకు త్వరగా విశ్రాంతి చేకూర్చగలదు. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.

 23. మెమరీ పవర్ పెరుగుతుంది
కొబ్బరి నీళ్ల వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. చాలా అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది.

 24. డిప్రెషన్
కొబ్బరి నీటిలో మెగ్నీషియం దాదాపు 60 మి. గ్రా ఉంటుంది. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి కాపాడుతుంది. అందువల్ల రోజూ మీరు కొబ్బరి నీటిని తాగడం చాలా మంచిది.

 25. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మంచిది
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పలు సమస్యల ద్వారా బాధపడుతుంటారు.
ఎక్కువగా అలసట చెందడం, కండరాల తిమ్మిరి, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల ఈజీగా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు

 26. అధిక జ్వరం
అధిక జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కొబ్బరి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీరు కోల్పొయిన శక్తిని తిరిగి పొందుతారు.

 27. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం
కొబ్బరి నీళ్ల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
గ్రాస్టిక్ సమస్య వల్ల కొందరు చాలా ఇబ్బందిపడుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొంతమేరకు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

28. వృద్ధాప్య ఛాయలు రాకుండా
వయస్సు పెరిగేకొద్ది వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖంపై
ముడుతలు ఏర్పడుతుంటాయి. అయితే ప్రతి రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఇలాంటి ముడతలు కాస్త తగ్గుతాయి.
# 29. చర్మం కాంతివంతంగా మారుతుంది
కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది. మీ స్కిన్ ఎప్పుడూ కోమలంగా ఉంటుంది.
# 30. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: