మన శరీరాన్ని నిత్యం మోసేది ఎముకలే.. శరీరానికి అసలైన నిర్మాణాన్ని ఇచ్చేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇవి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అభి వృద్ధి  చెందుతూనే ఉంటాయి. ముప్పయ్యేళ్ల వరకు ఎముకల అభి వృద్ధి  వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపై వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వయసుతోపాటు వచ్చే కీళ్లు, మోకాళ్ల అరుగుదలకి చెక్‌ పెట్టొచ్చు. 

 ఎముకల్లో యాభై శాతం ప్రొటీన్‌ ఉంటుంది. అందువల్ల ఎముకల ఆరోగ్యానికి ప్రొటీన్‌ తప్పనిసరి. అది తగ్గితే క్యాల్షియం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రొటీన్‌ తగ్గడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. పెద్దవాళ్లు సగటున రోజుకు వంద గ్రాములకుపైగా ప్రొటీన్‌ తీసుకోవాలి. ప్రొటీన్‌ తగినంత తీసుకుంటే స్త్రీలలో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కోడిగుడ్లు, చికెన్‌? బ్రెస్ట్‌, చేపలు, బాదం, ఓట్స్‌, యోగర్ట్‌, మిల్క్‌, బ్రొకోలి, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న.

ఎముకల్ని బలంగా ఉంచడంలో విటమిన్‌ డి, విటమిన్‌ కె కీలకపాత్ర పోషిస్తాయి. శరీరం క్యాల్షియంను గ్రహించడంలో విటమిన్‌ డి ఉపయోగపడుతుంది. ఆస్టియోపినియా, ఆస్టియోపొరోసిస్‌, వంటి ఎముల వ్యాధులు రాకుండా చూస్తుంది. విటమిన్‌ డి లభించే పదార్థాలు: చేపలు, నారింజ, పాలు, యోగర్ట్‌, కోడిగుడ్లు. విటమిన్‌ కె లభించే పదార్థాలు: ఆకు కూరలు, బ్రొకోలి, గ్రీన్‌? బీన్స్‌, చికెన్‌, కివి, బఠాణి.

 ఎముకల ఆరోగ్యం లోకీలకపాత్ర వహించేది క్యాల్షియం. బోన్స్‌ బలంగా ఉండాలంటే రోజూ తగినంత క్యాల్షియం తీసుకోవాలి. ఎముకలు విరిగినా, తిరిగి కోలుకోవడంలో క్యాల్షియం తోడ్పడుతుంది. సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాల ద్వారానే క్యాల్షియం తీసుకునేందుకు ప్రయత్నించాలి.

ఒకవేళ క్యాల్షియం సరిగ్గా అందకుంటే సప్లిమెంట్‌ లు తీసుకుంటూ ఉండాలి. పాలు, పాలపదార్థాలు, సోయా మిల్క్‌, వైట్బీన్స్‌, బాదం, నువ్వులు, నారింజపండు, ఆకు కూరలు, చేపలు తింటే క్యాల్షియం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: