కరివేపాకు ఒకరకమైన సుగంధ భరితమైన ఆకు. ప్ర‌తి ఒక్క‌రూ వీటి సువాస‌న వ‌ల్ల‌ ఎప్ప‌టిక‌ప్పుడు  భోజన పదార్థాలలో విరివిగా వాడతారు. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరుపై బెరడు, కాండంపై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కొంత మంది వంట‌ల్లో వేసే క‌రివేపాకును తీసి ప‌క్క‌న పెట్టేస్తారు. నిజానికి కరివేపాకులో చాలా ఔషధ గుణాలున్నాయి. అలాగే పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..


- అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారు ప‌చ్చి క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటి. క‌రివేపాకు శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలిగిస్తుంది. 


- ఎక్కువ శాతం ఆడ‌వాళ్లు జుట్టు రాల‌డంతో బాధ‌ప‌డ‌తారు. అయితే వాళ్లు రోజు క‌రివేపాకు తినడం వ‌ల్ల డాండ్రఫ్ తో పాటు జుట్టు రాలిపోవడం మ‌రియు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపాతాయి.


- కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది.


- డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌కు క‌రివేపాకు బాగా స‌హాయ‌ప‌డుతుంది. రక్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గించే శ‌క్తి క‌రివేపాకు ఉండ‌డంతో  దీన్ని రోజు తిన‌డం చాలా ఉత్త‌మం.


- కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.


- ప్ర‌తిరోజు క‌రివేపాకును తిన‌డం అజీర్తిని స‌మ‌స్య‌లు స‌మ‌స్య‌లు త‌గ్గించి ఆక‌లిని బాగా పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.


- కరివేపాకు రసంలో కాస్త నిమ్మకాయ రసం, చక్కెర కలుపి తాగితే గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు త‌గ్గ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది.


- క‌రివేపాకు ప్ర‌తిరోజు తిన‌డం వ‌ల్ల మూత్ర పిండాల సమస్యలు ఉండ‌వు. కిడ్నీల్లో కొందరికి రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిని కరివేపాకు ఈజీగా కరిగించగలదు.


- కరివేపాకులో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోవ‌డంలో స‌హాయ‌పడుతుంది. మ‌రియు ముఖం కాంతివంతంగా ఉండ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: