సాధారణంగా డ్రైఫ్రూట్స్ లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. డ్రై ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచి చేకూరుతుందని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే డ్రై ఫ్రూట్స్‌ తింటే అంతా ఆరోగ్యమే అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కానీ వీటిని మితిమీరి తింటే రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం కూడా మంచిదే. కానీ, మితిమీరిన స్థాయిలో తీసుకోవటం వల్ల శరీర బరువులో అనూహ్యమైన మార్పులు తప్పవు. రెండు చెంచాల డ్రై ఫ్రూట్స్‌ ను తినటం వల్ల సమస్యలేదు. కానీ.. అదే ప‌నీగా అధిక మోతాదులో తింటే మాత్రం అంత మంచివి కాదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌ లో సహజ చక్కెరలు ఫ్రక్టోజ్‌ రూపంలో ఉంటాయి. 


అయితే మార్కెట్లో మాత్రం ప్యాకింగ్‌తో లభించే డ్రై ఫ్రూట్స్‌ ఒకదానితో ఒక అంటుకోకుండా, కనీస తేమ కలిగి ఉండటం కోసం అదనపు చక్కెరలతో కోటింగ్‌ చేస్తారు. ఈ కోటింగ్‌ చేసిన చక్కెరలు దంతాలకు అతుక్కునేలా చేసి, దంత క్షయాన్ని కలిగిస్తాయి. అదే విధంగా డ్రై ఫ్రూట్స్‌ ఫైబర్‌లను అధిక స్థాయిలో కలిగి ఉంటాయి. దీని వల్ల గ్యాస్‌, బ్లోటింగ్‌ (ఉబ్బరం), తిమ్మిరులు, మలబద్దకం, విరేచనాల వంటి సమస్యలు వస్తాయి. సో.. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే అయినా.. మితంగా తీసుకోవ‌డం ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి: