కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. స‌హ‌జంగా కుంకుమ పువ్వు అనగానే అందరికి గుర్తొచ్చేది గర్భంతో ఉన్న ఆడవారు. దీనికి కారణం కుంకుమ పువ్వు వీరికి ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ భూభాగంలో అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. కుంకుమ పువ్వును కొన్ని ప్రాంతాల్లో కేసర్ అని కూడా పిలుస్తారు. కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. 


అలాగే యాభైకి పైబడుతున్నవారు ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలని వైద్యుల సూచన. కుంకుమ పువ్వు 'క్రోసిన్', 'క్రోసెటిన్'లను కలిగి ఉండటం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కుంకుమ పువ్వు క్యాన్సర్'ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్న కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ పెరగటాన్ని నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి కూడా కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది.


అంతేకాదు, కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు. ఇక  గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారన్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: