నోటి దుర్వాసన.. చాల మందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ బ్రష్ చేసిన‌ప్ప‌టికీ.. కొందరు ఈ స‌మ‌స్య బాధ‌ప‌డుతుంటారు. నోటి దుర్వాసన వస్తుంటే మనం నలుగురితో కలవడానికి ఇబ్బంది పడడమే కాదు ఇతరులు కూడా మనతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు.  ఇది కేవలం బ్రష్‌ చేసుకోవటం, మౌత్‌వాష్‌ల వంటివి వాడటంతో తగ్గిపోయే సమస్య కాదు. సర్వసాధారణంగా మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, వైద్య పరిస్థితితులు, జీర్ణశయాంతర వ్యాధులు, ధూమపానం మరియు మద్యపానం వల్ల నోరు పొడిబారడంతో నోటి దుర్వాసనకు ఇవన్నీ ప్రధాన కారణాలు.

 

అయితే ఈ స‌మ‌స్య‌కు కీరాదోస‌తో ఎంతో చ‌క్క‌గా చెక్ పెట్ట‌వ‌చ్చు. కీరాదోస‌ నోటి దుర్వాసనను నిరోధిస్తుంది. కీరా ముక్కను తరిగి నోటి పై భాగంలో ముప్పై సెకండ్ల పాటు నాలుకతో అదిమి ఉంచడం వల్ల ఫైటోకెమికల్స్ ఉత్పన్నమై దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. దీంతో నొటి దుర్వాస‌న‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

మ‌రియు దోసకాయలో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సి లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం లతో పాటు 95% నీరు ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే.. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ నోరు పొడిగా మారకుండా జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. భోజనం తరువాత నోటిని పుక్కిలించాలి. అలా చేయడం వల్ల దంతాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారం బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: